Begin typing your search above and press return to search.

అందుకే పవన్ సినిమాకి 'నో' చెప్పి, విజయ్ చిత్రాన్ని 'ఓకే' చేసిందా..?

By:  Tupaki Desk   |   8 Jun 2022 1:30 AM GMT
అందుకే పవన్ సినిమాకి నో చెప్పి, విజయ్ చిత్రాన్ని ఓకే చేసిందా..?
X
టాలీవుడ్ లో మోస్ట్ డిమాండబుల్ హీరోయిన్ గా దూసుకుపోతోంది పూజా హెగ్డే. ఈ క్రమంలో పరాజయాలు పలకరించినా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. స్టార్ హీరోలకు ఈ భామ ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది.

దీంతో దీనికి తగ్గట్టుగానే సినిమా సినిమాకి రెమ్యునరేషన్‌ పెంచుకుంటూ పోతోంది పూజా. ఇప్పుడు బుట్టబొమ్మ పారితోషికం రూ. 5 కోట్లకు చేరుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో దాదాపు అర డజను ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా పెద్ద చిత్రాలే. లేటెస్టుగా "JGM" (జనగణమన) అనే పాన్ ఇండియా మూవీ కూడా అమ్మడి ఖాతాలోకి వచ్చి చేరింది.

విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమా 'జనగణమన'. పూరి కనెక్ట్‌ & శ్రీకర స్డూడియో బ్యానర్లపై ఛార్మి కౌర్‌ - దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ తో కలిసి పూజా తొలిసారిగా రొమాన్స్ చేయబోతోంది.

ఇందుకు గాను పూజా రూ. 5 కోట్లను రెమ్యునరేషన్ గా తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో ఆమె చెల్లింపులు రూ. 4 కోట్లు అయితే.. రూ.1 కోటి ఆమె సిబ్బంది జీతాలు మరియు ఇతర ఖర్చుల కోసం తీసుకోనుందని అంటున్నారు.

ఇదే కనుక నిజమైతే టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకోనున్న హీరోయిన్ పూజానే అవుతుంది. ఈ రేంజులో రెమ్యునరేషన్ వస్తోంది కాబట్టే.. విజయ్ దేవరకొండ చిత్రానికి ఓకే చెప్పి.. 'భవదీయుడు భగత్ సింగ్' చిత్రాన్ని వదులుకుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ మరియు డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా 'భవదీయుడు భగత్‌ సింగ్‌'. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే ని ఎంపిక చేసినట్లు మేకర్స్ ఇప్పటికే ధ్రువీకరించారు. అయితే 'JGM' చిత్రానికి అధిక పారితోషికం అందడంతో.. పవన్ ప్రాజెక్ట్ ని కూడా వదులుకుందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తారు.. 'భవదీయుడు' సినిమాని ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకొస్తారనే దానిపై క్లారిటీ రావడం లేదు. మరోవైపు పూజా కు ఇతర ఆఫర్స్ వస్తున్నాయి. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ కోసం అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉండటంతో.. పవన్ మూవీని పక్కన పెట్టిందనే కామెంట్స్ వస్తున్నాయి.

ఇకపోతే ఈ ఏడాదిలో 'రాధే శ్యామ్' - 'బీస్ట్' - 'ఆచార్య' వంటి చిత్రాలతో పలకరించిన పూజా హెగ్డే.. ఇటీవల 'ఎఫ్ 3' లో స్పెషల్ సాంగ్ తో అలరించింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కనున్న SSMB28 మూవీలో పూజా హీరోయిన్ గా నటించనుంది.

అలానే హిందీలో రణవీర్ సింగ్ తో ‘సర్కస్’ మరియు సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కభీ దివాలి’ సినిమాలలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నప్పటికీ.. కన్నడ బ్యూటీ తెలుగు చిత్రాలను మాత్రం వదులుకోవడం లేదు. మరి త్వరలోనే పవన్ సినిమాకి నో చెప్పిందా లేదా అనే దానిపై స్పష్టత వస్తుందేమో చూడాలి.