Begin typing your search above and press return to search.
మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్ట్ క్రేజీ అప్డేట్
By: Tupaki Desk | 17 Jun 2021 6:30 AM GMTకొన్ని ప్రాజెక్ట్స్ ఎంతో ఇంట్రెస్ట్ ను కలిగిస్తాయి. కాని దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్ట్ లు ఆలస్యం అవుతూనే ఉంటాయి. ఇండియన్ సినిమా మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్ట్ ల్లో షారుఖ్ ఖాన్ మరియు తమిళ దర్శకుడు అట్లీ ప్రాజెక్ట్ ఒకటి. ఈ ప్రాజెక్ట్ రెండు మూడు సంవత్సరాలుగా మీడియాలో చర్చనీయాంశంగానే ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం షారుఖ్ అభిమానులతో పాటు సౌత్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ ప్రాజెక్ట్ అదుగో ఇదుగో అన్నట్లుగా జరుపుతూ వస్తున్నారు. ఇటీవల పరిణామాలు చూస్తుంటే ఈ సినిమా వచ్చే ఏడాదికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.
జీరో సినిమా ప్లాప్ తో షారుఖ్ దాదాపుగా మూడు సంవత్సరాలు సినిమాలకు పూర్తిగా దూరం ఉన్నాడు. ప్రస్తుతం ఆయన పటాన్ సినిమాను చేస్తున్నాడు. ఆ తర్వాత అట్లీ దర్శకత్వంలో చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ సినిమా కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యిందని.. షారుఖ్ డేట్ల కోసం అట్లీ వెయిట్ చేస్తున్నాడు అంటూ తమిళ సినీ వర్గాల వారు చెబుతున్నారు. హిందీతో పాటు తమిళంలో కూడా రూపొందబోతున్న ఈ సినిమా ను సౌత్ లో అన్ని భాషల్లో కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది. అందుకే ఈ సినిమా కోసం స్టార్ మ్యూజిక్ కంపోజర్ ను సెలక్ట్ చేశారట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మోస్ట్ వెయిటెడ్ మూవీ కి గాను స్టార్ మ్యూజిక్ కంపోజర్.. ఆస్కార్ అవార్డ్ గ్రహీత అయిన ఏఆర్ రహమాన్ ను ఓకే చేశారట. ఆయన ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. త్వరలోనే పట్టాలెక్కబోతున్న ఈ ప్రాజెక్ట్ కు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది. రహమాన్ సినిమా అంటే మరో రేంజ్ లో ఉంటుంది. ఆయన సంగీతం ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉర్రూతలూగిస్తూ ఉంది. షారుఖ్.. అట్లీల సినిమాకు ఖచ్చితంగా ఈయన సంగీతం అదనపు ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.