Begin typing your search above and press return to search.

మోస్ట్ అవైటెడ్ 'మనీ హీస్ట్' ఫైనల్ సీజన్ షూటింగ్ పూర్తి..!

By:  Tupaki Desk   |   15 May 2021 7:27 AM GMT
మోస్ట్ అవైటెడ్ మనీ హీస్ట్ ఫైనల్ సీజన్ షూటింగ్ పూర్తి..!
X
ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ లలో ''మనీ హేస్ట్'' వెబ్ సిరీస్ ఒకటి. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్‌ ఫ్లిక్స్ వారి ఈ స్పానిష్ క్రైమ్ డ్రామాకి సౌత్ ఇండియాలో కూడా అభిమానులు ఉన్నారు. ఇప్పటికే నాలుగు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ కు.. ఐదవ సీజన్ రాబోతోందని ప్రకటించారు. ఇదే ఫైనల్ సీజన్ అని కూడా పేర్కొన్నారు. అప్పటి నుంచి 5వ సీజన్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్‌ ఫ్లిక్స్ వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది.

'మనీ హీస్ట్' (లే కాసా డి పాపెల్) వెబ్ సిరీస్ ఐదవ మరియు ఆఖరి సీజన్ షూటింగ్ కంప్లీట్ అయిందని నెట్ ఫ్లిక్స్ అఫీసియల్ సోషల్ మీడియా హ్యాండిల్‌ లో శుక్రవారం పోస్ట్ పెట్టారు. దోపిడీగా ప్రారంభమై కుటుంబంగా ముగిసింది. లా కాసా డి పాపెల్/మనీ హీస్ట్ 5 వ సీజన్ షూటింగ్ పూర్తయింది. ఇందులో భాగమైన అభిమానులందరికీ ధన్యవాదాలు! ఈ కథ ఎలా ముగుస్తుందో మీకు చూపించడానికి మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము'' అని నెట్‌ ఫ్లిక్స్ తన పోస్ట్‌ లో పేర్కొంది. ఈ సందర్భంగా 'మనీ హేస్ట్' టీమ్ అందరూ రెడ్ జంప్‌ సూట్స్‌ లో సంతోషంగా నవ్వుతూ ఉన్న ఓ ఫోటోని షేర్ చేశారు. ఫైనల్ సీజన్ షూటింగ్ స్పెయిన్ - డెన్మార్క్ మరియు పోర్చుగల్ దేశాలలో జరిగినట్లు తెలుస్తోంది.

'మనీ హీస్ట్' సిరీస్ నెట్‌ ఫ్లిక్స్ లో అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర సిరీస్ గా రికార్డు సృష్టించింది. అలెక్స్ పినా క్రియేట్ చేసిన ఈ స్పానిష్ క్రైమ్ సిరీస్ ని వాంకోవర్ మీడియా వారు నిర్మించారు. సీజన్ 5 లో 10 ఎపిసోడ్‌ లు ఉంటాయని తెలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ స్పెయిన్‌ లో గ్యాంగ్ కొనసాగించే దోపిడీకి ఇది ముగింపు పలకనుంది. అయితే ఐదవ సీజన్ విడుదల తేదీని నెట్ ఫ్లిక్స్ ఇంకా ప్రకటించలేదు. ఇకపోతే 'మనీ హేస్ట్' వెబ్ సిరీస్ నాలుగు సీజన్లను తెలుగు తమిళ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకు వచ్చినట్లుగా నెట్ ఫ్లిక్స్ ఇండియా ఇంతకముందు ప్రకటించింది.