Begin typing your search above and press return to search.
మంచు హీరో ఈసారి హిట్ కొట్టేలా ఉన్నాడే...!
By: Tupaki Desk | 5 Oct 2020 2:20 PM ISTమంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మోసగాళ్లు'. ప్రపంచంలో అతి పెద్దదైన ఐటీ స్కామ్ ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో విష్ణు సోదరి పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా పై కాస్త క్రేజ్ పెరిగింది. ఇప్పటికే 'మోసగాళ్లు' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.
కాగా, మంచు విష్ణు కెరీర్ లోనే ఎప్పుడూ లేనంతగా 'మోసగాళ్లు' టీజర్ ట్రెండ్ అవుతోంది. యూట్యూబ్ గత రెండు రోజులుగా నెంబర్ వన్ ప్లేస్ నుంచి జారకుండా అలానే స్టడీగా కొనసాగుతోంది. దీంతో మంచు హీరో ఈసారి గట్టిగా కొట్టేలా ఉన్నాడే అని సినీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ ని భారీ బడ్జెట్ తో అత్యున్నతమైన సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి టాలీవుడ్ కు పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రుహీ సింగ్ - నవదీప్ - నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్కామ్ నేపథ్యంలో గతంలో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. మరి 'ఢీ' 'దేనికైనా రెడీ' సినిమాల తర్వాత సరైన హిట్ లేని మంచు విష్ణుకి 'మోసగాళ్లు' ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.