Begin typing your search above and press return to search.

'మోసగాళ్లు' దీపావళి కానుక

By:  Tupaki Desk   |   12 Nov 2020 1:00 PM GMT
మోసగాళ్లు దీపావళి కానుక
X
మంచు హీరో విష్ణు.. సునీల్‌.. కాజల్‌ కీలక పాత్రల్లో నటించిన 'మోసగాళ్లు' సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది. సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్‌ అయిన వెంటనే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో విష్ణు మరియు కాజల్‌ లు బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ లుగా కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కీలక పాత్రలో నటించడంతో సినిమా మార్కెట్‌ మరింతగా పెరింది.

రేపు దీపావళి కానుకగా ఈ సినిమా టీజర్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఏసీపీ కుమార్‌ గా సునీల్‌ శెట్టి ఫస్ట్‌ లుక్‌ ను రివీల్‌ చేశారు. విష్ణు హీరోగా నటించడంతో పాటు నిర్మించిన ఈ సినిమాకు జెఫ్రీ గీ జైన్‌ దర్శకత్వం వహించాడు. తెలుగుతో పాటు తమిళం.. హిందీ... మలయాళం.. కన్నడంలో విడుదల కాబోతుంది. ప్రపంచంలోనే అత్యంత భారీ ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లుగా చెబుతున్నారు. ఈ సినిమాపై అంచనాలు పెంచేలా టీజర్‌ ఉంటుందని అంటున్నారు.