Begin typing your search above and press return to search.

ఆ టాలెంటెడ్ నటుడు కూడా కీచకుడే

By:  Tupaki Desk   |   25 May 2018 10:29 AM IST
ఆ టాలెంటెడ్ నటుడు కూడా కీచకుడే
X
దేశీయ ఫిలిం ఇండస్ట్రీలో నడిచే క్యాస్టింగ్ కౌచ్ విషయంలో.. ఆరోపణలు చేసుకోవడం దగ్గరే ఉంది. అఫ్ కోర్స్.. టాలీవుడ్ లో ఇది పక్కదారి పట్టేసి సైలెంట్ అయిపోయింది. కానీ హాలీవుడ్ లో మాత్రం నెక్ట్స్ లెవెల్ కి వెళ్లిపోయింది. ఆయా భామలు స్వయంగా తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. క్యాస్టింగ్ కౌచ్ మాత్రమే కాదు.. ఆన్ సెట్స్ పై కూడా జరిగిన లైంగిక వేధింపుల వ్యవహారాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.

కెవిన్ స్పేసీ వ్యవహారం తర్వాత.. ఇప్పుడీ జాబితాలోకి మోర్గాన్ ఫ్రీమ్యాన్ పేరు వచ్చి చేరింది. ప్రస్తుతం 80 ఏళ్ల వయసున్న ఈయన.. ది షోషంక్ రిడెంప్షన్.. బ్యాట్ మ్యాన్ ట్రయాలజీ - ఇన్విక్టస్ తో పాటు అనేక బడా ప్రాజెక్టులలో నటించాడు. అయితే.. ఆయా సినిమాల షూటింగ్ సమయాల్లో ఈయన బిహేవియర్ పై.. ఓ ఛానల్ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఇప్పటివరకూ 20 మంది కో-యాక్టర్స్ ను ప్రశ్నించగా.. వారిలో మెజారిటీ మహిళలు.. మోర్గాన్ చేసే అసహ్యకరమైన పనుల గురించి చెప్పారని ఆ ఛానల్ అంటోంది.

వీరిలో ఒక మహిళ అయితే.. 'స్కర్ట్ పైకి ఎత్తి చూసి.. నువ్వివాళ అండర్వేర్ వేసుకున్నావో లేదో అని చూశా' అని మోర్గాన్ అనేవాడని చెప్పిందట. ఎలా ప్రవర్తిస్తే మహిళలకు ఇబ్బందిగా ఉంటుందో.. అలాంటివి ఏ మాత్రం మొహమాటం లేకుండా చేసేవాడట. ఈయనకు ఒకరిద్దరు క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ.. ఎక్కువ మంది మాత్రం ఈయనను కీచకుడి కిందే జమకట్టారు.