Begin typing your search above and press return to search.

మూవీ బడ్జెట్‌ లో సగంకు ఎక్కువ హీరో పారితోషికమే

By:  Tupaki Desk   |   2 Aug 2019 1:52 PM IST
మూవీ బడ్జెట్‌ లో సగంకు ఎక్కువ హీరో పారితోషికమే
X
ప్రస్తుతం బాలీవుడ్‌ లో సక్సెస్‌ ఫుల్‌ గా దూసుకు పోతున్న హీరో అక్షయ్‌ కుమార్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన గత నాలుగు అయిదు సంవత్సరాలుగా రికార్డు స్థాయి సక్సెస్‌ రేటును కలిగి ఉన్నాడు. ఇండస్ట్రీలో ఏ హీరోకు లేనన్ని 100- 150- 200 కోట్ల సినిమాలు ఈయన ఖాతాలోనే ఉన్నాయి. తాజాగా ఫోర్బ్స్‌ జాబితాలో కూడా బాలీవుడ్‌ నుండి ఈయన నెం.1 గా నిలిచాడు. ప్రస్తుతం 'మిషన్‌ మంగళ్‌' తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు. ఆగస్టు 15న ఆ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సమయంలోనే అక్షయ్‌ కుమార్‌ పారితోషికం గురించి బాలీవుడ్‌ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

అక్షయ్‌ కుమార్‌ కొత్తగా ఓకే చెప్పిన సినిమాలకు 45 నుండి 50 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈయన సినిమాలు మీడియం బడ్జెట్‌ లోనే ఉంటాయి. ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాల బడ్జెట్‌ 100 కోట్ల లోపే అంటూ సమాచారం అందుతోంది. అంటే సినిమా బడ్జెట్‌ లో సగంకు పైగా ఈయన పారితోషికం ఉంటుందని అంటున్నారు. అక్షయ్‌ పారితోషికం ప్రస్తుతం బాలీవుడ్‌ హీరోల్లోనే టాప్‌ అన్నట్లుగా సమాచారం అందుతోంది.

అక్షయ్‌ కుమార్‌ సినిమాలకు రికార్డు స్థాయి పారితోషికం తీసుకోవడమే కాకుండా పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వ్యవహరిస్తున్నాడు. వాటి ద్వారా కూడా పదుల కోట్లలో పారితోషికం అందుకుంటున్నాడు. ఇక వెబ్‌ సిరీస్‌ ల్లో కూడా నటించేందుకు అక్షయ్‌ ఓకే చెప్పాడు. దాంతో కూడా భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నాడు. మొత్తానికి అక్షయ్‌ కుమార్‌ టైం నడుస్తోంది.