Begin typing your search above and press return to search.
చిరు బర్త్ డే సందర్బంగా ‘లూసీఫర్’ మరింత క్లారిటీ
By: Tupaki Desk | 22 Aug 2020 11:00 PM ISTమలయాళ సూపర్ హిట్ ‘లూసీఫర్’ ను తెలుగులో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెల్సిందే. ప్రముఖ నిర్మాత చిరంజీవి కోసం ఆ రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగిందట. ఇప్పటికే సుజీత్ ను ఆ రీమేక్ కోసం తీసుకోవడం ఆయన రెడీ చేసిన స్క్రిప్ట్ కు చిరంజీవి సంతృప్తి వ్యక్తం చేయక పోవడంతో ఈ ప్రాజెక్ట్ ను మరో దర్శకుడి చేతికి అప్పగించేందుకు సిద్దం అయినట్లుగా కొన్ని వారాల క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలపై మరింత స్పష్టత వచ్చింది.
సుజీత్ తప్పుకున్న వెంటనే పలువురి పేర్లు ప్రచారం జరిగింది. అయితే ఎక్కువ మాత్రం వినాయక్ పేరు వినిపించింది. అంతా అనుకున్నట్లుగానే ప్రముఖ రచయితలు మరియు తన టీంతో కలిసి ‘లూసీఫర్’ కోసం తెలుగు వర్షన్ స్క్రిప్ట్ ను రెడీ చేయడం జరిగిందట. రీమేక్ స్క్రిప్ట్ విషయంలో చిరంజీవి సంతృప్తి వ్యక్తం చేశాడని ఆచార్య సినిమా పూర్తి అయిన తర్వాత చేద్దామంటూ హామీ ఇచ్చాడట. దాంతో వినాయక్ మళ్లీ ఒక భారీ సినిమాను చేయబోతున్నాడు. ఖైదీ నెం.150 చిత్రంను చేసిన వినాయక్ ఆ సినిమా సూపర్ హిట్ అయినా కూడా ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కించుకోలేదు. దానికి తోడు ఆయన నటుడిగా మారేందుకు ప్రయత్నం చేసి విఫలం అయ్యాడు.
ఇప్పుడు చిరంజీవి లూసీఫర్ రీమేక్ బాధ్యతలు అప్పగించడంతో మరోసారి తన సత్తా నిరూపించుకుని స్టార్ హీరోలతో సినిమాలకు ఒప్పించాలని వినాయక్ భావిస్తున్నాడట. వచ్చే ఏడాదిలో ప్రారంభించి వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. చిరంజీవి.. వినాయక్ ల కాంబోలో వచ్చిన గత చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే సెంటిమెంట్ లో ఫ్యాన్స్ ఉన్నారు.