Begin typing your search above and press return to search.

మ‌రో ర‌మ్య‌కృష్ణ‌ అమ్మోరులా..!

By:  Tupaki Desk   |   1 March 2020 11:30 AM GMT
మ‌రో ర‌మ్య‌కృష్ణ‌ అమ్మోరులా..!
X
అమ్మోరు సినిమాలు క‌నుమ‌రుగై చాలా కాల‌మే అయ్యింది. పెద్ద తెర‌పై దేవ‌త‌ల దివ్య‌రూపాల్ని చూసి త‌రించే అవ‌కాశం అన్న‌దే లేకుండా పోయింది. అమ్మోరు సినిమాలో ర‌మ్య‌కృష్ణ రూపాన్ని అంతే తేలిగ్గా అభిమానులు మ‌ర్చిపోలేరు. అయితే ఇటీవ‌లి కాలంలో అస‌లు అలాంటి వేషం క‌ట్టేందుకు ఏ క‌థానాయిక‌గా సిద్ధంగా లేక‌పోవ‌డమో లేక అస‌లు అలాంటి క‌థ‌ల్ని రాసే ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు అంత‌మ‌వ్వ‌డ‌మో అస‌లు చూద్దాం అంటే భ‌క్తి - అమ్మోరు సినిమాలే క‌నిపించ‌లేదు.

అయితే కొంత గ్యాప్ త‌ర్వాత నాగిని బ్యాక్ డ్రాప్ సినిమాలు రిపీటైనా కానీ.. అమ్మోరు బ్యాక్ డ్రాప్ రిపీట్ కాలేదేమిటో అన్న సందేహం కొంద‌రిని వెంటాడింది. అందుకే అలాంటి డౌట్ల‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడు ఏకంగా న‌య‌న‌తార అమ్మోరు వేషం వేస్తోంది. ఇదిగో ఇక్క‌డ భీక‌రంగా త్రిశూల‌ధారియై క‌నిపిస్తున్న ఈ పోస్ట‌ర్ చూడ‌గానే రెండు లెంప‌లు వాయించుకుని దండం పెట్టాల‌ని అనిపించ‌కుండా ఉండ‌దు ఎవ‌రికైనా. అయితే ఈ అమ్మోరు ఉగ్ర‌రూపం దాల్చ‌లేదు. క‌రుణామ‌య దేవ‌త‌లా క‌నిపిస్తోంది.

ఇంత‌కుముందు శ్రీ‌రామ‌రాజ్యం చిత్రంలో సీతాదేవిగా నార చీర‌ల్ని క‌ట్టిన‌ప్పుడు న‌య‌న్ రూపానికి ఫిదా అయిపోయారు. మొన్న సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రంలో న‌ర‌సింహుని పెళ్లాడే రాణిగా న‌య‌న్ న‌ట‌న‌కు ఫిదా కాని వాళ్లు లేరు. అందుకే ఇప్పుడిలా అమ్మ‌వారి పాత్ర‌లో ట్రై చేస్తుంటే ఆస‌క్తి క‌లుగుతోంది. న‌య‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న కొత్త చిత్రం మూకుతి అమ్మ‌న్. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. రేడియో జాకీ కం న‌టుడు ఆర్జే బాలాజి ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. ఎన్‌.జే శ‌ర‌వ‌ణ‌న్ తో క‌లిసి బాలాజీనే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.