Begin typing your search above and press return to search.

ఆదిశక్తి అవతారమెత్తిన నయన్...!

By:  Tupaki Desk   |   5 Jun 2020 2:30 PM GMT
ఆదిశక్తి అవతారమెత్తిన నయన్...!
X
సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో కొన్నేళ్లుగా తిరుగులేని స్టార్ హీరోయిన్‌ గా వెలుగొందుతోంది నయనతార. మూడు పదుల వయసు దాటినా ఇప్పటికీ తరగని అందంతో సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్‌ గా సత్తా చూపిస్తూనే ఉంది నయన్. దక్షిణాది చిత్ర పరిశ్రమలోని స్టార్ట్ హీరోలు అందరి సరసన నటించింది. సినిమాలో క్యారెక్టర్ ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసే అతికొద్ది హీరోయిన్లలో నయనతార ఒకరని చెప్పవచ్చు. అందువ‌ల్లే ఆమె చిత్ర ప‌రిశ్ర‌మ‌లో లేడీ సూప‌ర్‌ స్టార్ అని పిలుపించుకునే స్థాయికి ఎదిగారు. ఈ క్రమంలో ఇప్పుడు నయనతార ఆదిశక్తి అవతారమెత్తారు. ఆర్జే బాలాజీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ''మూకుతి అమ్మాన్‌" అనే ఆధ్యాత్మిక చిత్రంలో నయన్ దేవ‌త పాత్ర‌ను పోషిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్‌ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

న‌య‌న‌తార ఈ ఫొటోల్లో నిండుగా ఆభ‌ర‌ణాలు ధ‌రించి ఓ చేతిలో త్రిశూలం ప‌ట్టుకుని ఎరుపు ఆకుప‌చ్చ చీరలో ప్ర‌కాశ‌వంతంగా మెరిసిపోతోంది. నయన్ అమ్మ‌వారి గెట‌ప్‌ లో ఆకట్టుకుంది. అమ్మ‌వారి అవ‌తార‌మెత్తిన న‌య‌న‌తార ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు న‌య‌న‌తార ఎన్నో వైవిధ్యమైన పాత్ర‌ల్లో న‌టించినప్పటికీ అమ్మ‌వారిగా క‌నిపించ‌డం మాత్రం ఇదే ఫస్ట్ టైం అని చెప్పవచ్చు. ఆదిశక్తిగా న‌య‌న‌తార సరిగ్గా స‌రిపోయిందంటూ ఆమె ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ఈ సినిమా గురించి ద‌ర్శ‌కుడు ఆర్జే బాలాజీ మాట్లాడుతూ ఇది పూర్తిగా ఆధ్యాత్మిక‌ చిత్రమేన‌ని.. చిన్న‌ప్ప‌టి నుంచి చూస్తూ పెరిగిన భ‌క్తి చిత్రాల్లో ఉన్న అంశాల‌న్నీ ఇందులోనూ ఉంటాయ‌ని పేర్కొన్నారు. మూకుతి అమ్మన్ చిత్రం ఒక పేద కుటుంబం చుట్టూ తిరుగుతుంద‌ని స‌మాచారం. ఈ సినిమా థియేట‌ర్‌ లోనే చూడాల‌ని ద‌ర్శ‌కుడు బాలాజీ స్ప‌ష్టం చేశాడు. ఈ సినిమాలో ఊర్వ‌శి, స్మృతి వెంక‌ట్‌, అజ ఘోష్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఇశారి కె గ‌ణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గిరీశ్ సంగీతం స‌మ‌కూర్చారు.