Begin typing your search above and press return to search.

‘తలైవి’ మూవీకి అంత డబ్బును అక్రమంగా తరలించారట

By:  Tupaki Desk   |   10 Sep 2021 4:30 AM GMT
‘తలైవి’ మూవీకి అంత డబ్బును అక్రమంగా తరలించారట
X
దివంగత అమ్మ జయలలిత జీవితకథను ‘తలైవి’ పేరుతో ఒక సినిమాను నిర్మించటం.. అదీ రోజున విడుదల కావటం తెలిసిందే. బాలీవుడ్ ‘క్వీన్’ కంగనారౌనత్ నటించిన ఈ మూవీపైన అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఒక వివాదంపై ఒకరు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ చేశారు. వాస్తవానికి ఇదో సివిల్ మ్యాటర్ గా వినిపిస్తున్నా.. మోసం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఉదంతంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై న్యాయ సలహా కోరారు.

ఇంతకూ జరిగిందేమంటే.. తన ప్రమేయం లేకుండా.. తమ సంస్థకు చెందిన పార్టనర్స్ వారి సొంత సంస్థ ద్వారా తలైవి మూవీకి నిధులు మళ్లించారని ఆరోపిస్తున్నారు విబ్రి మీడియా ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ కార్తిక్ క్రష్ణన్. ఫిర్యాదు అందుకున్న బంజారాహిల్స్ ఎస్ఐ కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 2లో విబ్రి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీసు ఉంది. ఈ సంస్థలో విష్ణువర్ధన్.. అతడి భార్య బింద్రా ప్రసాద్ తో పాటు పవన్ కుమార్ బట్టాడ్.. కార్తిక్ క్రిష్ణన్ లు డైరెక్టర్లుగా ఉన్నారు.

సంస్థకు సంబంధించిన బ్యాంకు ఖాతా జూబ్లీహిల్స్ లోని యాక్సిస్ బ్యాంకులో ఉంది. వారికి అందులో జాయింట్ అకౌంట్ ఉంది. అయితే..తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విష్ణువర్దన్.. బ్రిందా ప్రసాద్ లు గత ఏడాది ఫిబ్రవరిలో రూ.75 లక్షలను విబ్రి మోషన్ పిక్చర్స్ అనే సొంత సంస్థకు రెండు దఫాలుగా ఆన్ లైన్ ద్వారా నిధులు మళ్లించుకున్నట్లుగా కార్తిక్ క్రిష్ణన్ ఆరోపిస్తున్నారు. ఈ మొత్తాన్ని తలైవి మూవీ కోసం మళ్లించినట్లుగా చెబుతున్నారు. ఇందులో సివిల్ అంశాలు ఉండటం.. పోలీసులకు ఏ మేరకు సంబంధం అన్న విషయాన్ని తేల్చేందుకు న్యాయ నిపుణుల సలహాను కోరారు. వారి నుంచి సమాచారం వచ్చిన తర్వాత.. ఈ ఉదంతంపై విచారణ మొదలవుతుందన్న మాటను చెబుతున్నారు.