Begin typing your search above and press return to search.

వీడియో : ఒల్లు గగుర్లు పొడిచే యాక్షన్‌ సన్నివేశాలు

By:  Tupaki Desk   |   3 Aug 2021 5:30 AM GMT
వీడియో : ఒల్లు గగుర్లు పొడిచే యాక్షన్‌ సన్నివేశాలు
X
యాక్షన్‌ సినిమాలు.. వెబ్‌ సిరీస్ ల ప్రియులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న మనీ హీస్ట్ చివరిదైన సీజన్ 5 ట్రైలర్‌ వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా నెట్‌ ఫ్లిక్స్ లో ఈ వెబ్‌ సిరీస్ ను స్ట్రీమింగ్‌ చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని సీజన్ లు కూడా మంచి టాక్ ను దక్కించుకోవడంతో పాటు హాలీవుడ్‌ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. నెట్‌ ఫ్లిక్స్ ఇండియా ట్విట్టర్ అకౌంట్‌ లో అఫిషియల్‌ గా ట్రైలర్‌ ను షేర్‌ చేశారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పటి వరకు స్ట్రీమింగ్‌ అయిన నాలుగు సీజన్ లతో పోల్చితే ఈ సీజన్ మరింత ప్రత్యేకంగా ఉంటుందనే నమ్మకంను ఈ ట్రైలర్‌ కలిగిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. యాక్షన్‌ సినిమా ప్రియుల కోసం అన్నట్లుగా సస్పెన్స్ థ్రిల్లర్‌ యాక్షన్‌ సన్నివేశాలను ఈ సీరిస్ లో చూపించబోతున్నారు. సీజన్ 5 ను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. మొదటి భాగంకు సంబంధించిన టీజర్‌ తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు.

నెట్‌ ఫ్లిక్స్ వారు ఈ సీజన్‌ మొదటి భాగంను వచ్చే నెల 3న స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇక రెండవ పార్ట్‌ ను డిసెంబర్‌ 3న స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. ఈ సీజన్ లో కథ ఎలాంటి ముగింపు ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చివరి సీజన్‌ రెండు పార్ట్‌ లకు మూడు నెలల గ్యాప్ ఉండబోతుంది. గత సీజన్ లతో పోల్చితే ఈ సీజన్‌ కు మరింత పాజిటివ్‌ స్పందన వస్తుందని మేకర్స్ అంటున్నారు. ఇక ప్రేక్షకులు సిరీస్ కు మంచి ముగింపు ఉంటుందని.. ట్రైలర్‌ చూస్తుంటే ఒల్లు గగుర్లు పొడిచే విధంగా ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.