Begin typing your search above and press return to search.

ప్రపంచం ఎదురు చూస్తున్న 5.2 స్ట్రీమింగ్‌ తేదీ ఫిక్స్

By:  Tupaki Desk   |   19 Nov 2021 1:30 AM GMT
ప్రపంచం ఎదురు చూస్తున్న 5.2 స్ట్రీమింగ్‌ తేదీ ఫిక్స్
X
ఈమద్య కాలంలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతున్న వెబ్‌ సిరీస్ లు ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఒకటి థ్రిల్ చేస్తుంటే.. మరోటి ఎంటర్‌ టైన్ చేస్తుంటే ఇంకోటి భారీ యాక్షన్‌ సన్నివేశాలతో మెస్మరైజ్‌ చేస్తున్నాయి.

హాలీవుడ్‌ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా నెట్‌ ఫ్లిక్స్ వారు భారీ వెబ్‌ సిరీస్ లను తీసుకు వస్తున్నారు. స్క్విడ్ గేమ్ ఒక వైపు ఓటీటీ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తూనే ఉండగా మరో వైపు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న మనీ హేస్ట్‌ వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అప్డేట్ వచ్చింది. ఇప్పటి వరకు 5.1 సిరీస్ లు వచ్చినీ వెబ్‌ సిరీస్ నుండి చివరిదైన 5.2 సీజన్ స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది.

మనీ హేస్ట్‌ వెబ్‌ సిరీస్ కు సంబంధించిన 5.2 సీజన్ ప్రమోషనల్‌ వీడియోను తాజాగా విడుదల చేయడం జరిగింది. ప్రతి సీజన్‌ కూడా ఒక అద్బుతమైన థ్రిల్లింగ్‌ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకు వెళ్లింది అనడంలో సందేహం లేదు. గత సీజన్ చాలా ఆసక్తికరమైన పాయింట్స్ తో ముగించడం వల్ల చివరి ఎపిసోడ్‌ కోసం మనీ హేస్ట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పెద్ద ఎత్తున అంచనాలున్న మనీ హేస్ట్‌ వెబ్‌ సిరీస్ ను మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్‌ చేసేందుకు నెటిజన్స్ సిద్దం అవుతున్నారు. ఇప్పటి వరకు మనీ హేస్ట్‌ వెబ్ సిరీస్ లో కీలక పాత్రగా కనిపిస్తూ వచ్చిన ప్రొఫెసర్ నే ఈ సీజన్ లో కూడా ప్రథానంగా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఈవెబ్‌ సిరీస్ ను స్థానిక భాషల్లో విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో భాష రాని వారు కూడా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఒక వేళ అన్ని భాషల్లో అందుబాలో ఉంటే కచ్చితంగా మరింత మందికి ఈ వెబ్‌ సిరీస్ అందుబాటులోకి వస్తుందని అంటున్నారు.

స్క్విడ్ గేమ్ ను త్వరలో తెలుగు మరియు తమిళంలో తీసుకు రాబోతున్నారు. అలాగే ఈ మనీ హేస్ట్‌ ను కూడా స్థానిక భాషల్లో తీసుకు వచ్చే ఆలోచన చేయాలంటూ నెట్‌ ఫ్లిక్స్ వారికి విజ్ఞప్తి చేస్తున్నారు.