Begin typing your search above and press return to search.
బెల్లంకొండ శ్రీనివాస్ తో స్టెప్పులేస్తున్న 'బిగ్ బాస్' బ్యూటీ..!
By: Tupaki Desk | 29 Dec 2020 12:40 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''అల్లుడు అదుర్స్''. ఈ కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గొర్రెల సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో నభా నటేష్ - అనూ ఇమాన్యుల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 'రాక్షసుడు' వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఒక సాంగ్ మినహా 'అల్లుడు అదుర్స్' షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. అయితే ఈ సాంగ్ లో బెల్లంకొండ సరసన హీరోయిన్ మోనాల్ గజ్జర్ స్టెప్పులేయనుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.
'సుడిగాడు' 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' సినిమాలలో నటించిన మోనాల్ గజ్జర్.. 'బిగ్ బాస్' తెలుగు సీజన్-4 రియాలిటీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు 'అల్లుడు అదుర్స్' చిత్రానికి మోనాల్ క్రేజ్ అదనపు ఆకర్షణగా నిలుస్తుందని భావించిన మేకర్స్ ఆమెను స్పెషల్ సాంగ్ కోసం తీసుకున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఓ పెప్పీ సాంగ్ లో సాయి శ్రీనివాస్ తో కలిసి మోనాల్ కాలుకదపనుంది. ఈ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. దీని కోసం అవినాష్ కొల్లా ఓ భారీ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్ - సోనూసూద్ - వెన్నెల కిషోర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 'అల్లుడు అదుర్స్' చిత్రాన్ని సంక్రాంతికి విడుదలకు చేయనున్న నేపథ్యంలో త్వరలోనే సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు.