Begin typing your search above and press return to search.
అభిజిత్ లో ఆ ఒక్కటి మైనస్ మిగతా అన్ని ప్లస్
By: Tupaki Desk | 16 Dec 2020 9:00 PM ISTబిగ్ బాస్ హౌస్ నుండి 14వ వారం ఎలిమినేట్ అయిన మోనాల్ గజ్జర్ వరుసగా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది. ఇటీవల మోనాల్ ఒక వెబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు అభిజిత్ పై ఉన్న అభిమానం ను చెప్పకనే చెప్పింది. నాగార్జున సర్ మొదట్లో నీ మనసులో ఉన్న ఎ ఎవరు అంటూ ప్రశ్నించినప్పుడు అభి ఉన్నాడు. ఆ విషయాన్ని నేను చెప్పలేదు. కాని ఆ తర్వాత నేను అభితోనే చెప్పాను. నా మనసులో ఉన్న ఎ నువ్వే అంటూ అభిజిత్ తో చెప్పాను. కాని కొన్ని కారణాల వల్ల ఆయనకు నాతో విభేదాలు వచ్చాయి. అభిజిత్ మరియు అఖిల్ ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్. అభిజిత్ ఆట విషయంలో చాలా ఫోకస్ గా ఉంటాడని మోనాల్ చెప్పింది.
తన ప్రతి ఇంటర్వ్యూలో కూడా అభిజిత్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్న మోనాల్ ఇటీవల ఇంటర్వ్యూలో మరోసారి ఆయన గురించి మాట్లాడింది. అభిజిత్ అంటే అమ్మాయిలకు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఆయన నేను చేసేదే రైట్ అంటూ ఈగోగా మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో ఆయన ఇతరుల మాటలకు విలువ ఇవ్వడు. దాంతో అభిజిత్ కొన్ని సార్లు బ్యాడ్ అవుతాడు. ఆ ఈగోను వదిలేస్తే ఆయన చాలా స్వీట్ పర్సన్ అంటూ మోనాల్ చెప్పుకొచ్చింది. అభిజిత్ ఎంతగా మోనాల్ ను దూరం పెట్టాడో తెలిసిందే. అయినా కూడా మోనాల్ మాత్రం ఆయన పట్ల ఇంకా పాజిటివ్ గానే ఉంది.