Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ తో మీ నాన్న‌కు ఎఫైర్ ఉంద‌ట‌గా..!

By:  Tupaki Desk   |   8 Oct 2020 11:00 AM IST
ఆ హీరోయిన్ తో మీ నాన్న‌కు ఎఫైర్ ఉంద‌ట‌గా..!
X
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవితో బోనీక‌పూర్ ట్రాజిక్ డ్ర‌మ‌టిక్ ల‌వ్ స్టోరి గురించి తెలిసిందే. ఇద్ద‌రు పిల్ల‌లు అర్జున్ క‌పూర్‌.. అన్షులా క‌పూర్ స‌హా భార్య మోనా క‌పూర్ ‌ని వ‌దిలేసి ఆయ‌న‌ శ్రీ‌దేవిని ర‌హ‌స్య వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ టైమ్ ‌లో మోనాతో పాటు ఆమె పిల్ల‌లు బాగా స‌ఫ‌ర్ అయ్యార‌ట‌. ఓ టైమ్ లో అర్జున్ స్కూల్ లో వుండ‌గా అర్జున్ క‌పూర్ ని బోనీ- శ్రీ‌దేవిల ఎఫైర్ వ‌ల్ల సాటి విద్యార్థులు ఎగ‌తాళి చేశార‌ని బోనీ మాజీ భార్య దివంగ‌త మోనా క‌పూర్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

శ్రీ‌దేవి- బోనీల వ్య‌వహా‌రం తెలిసి మోనాక‌పూర్ తీవ్ర మనోవేద‌న‌కు గుర‌య్యార‌ట‌. రెండవ సంబంధం అంటే ఎలా వుంటుందో చదివాను.. విన్నాను. కానీ అదే నా జీవితంలో జ‌రిగింది. అప్పుడే నా వివాహ బంధం ముగిసింద‌ని స్ప‌ష్ట‌మైంది. అంత‌కుముందు మొద‌టి భార్య‌గా సంఘంలో గౌరవం వుండేది కానీ కాలక్ర‌మేనా అదీ పోయింది. అభివృద్ధి చెందుతున్నప్పుడు కొన్నిసార్లు మార్పు అవసరం. బోనీకి మరొకరి అవసరం ఏర్ప‌డింది. అప్పటికే శ్రీదేవి కి ఓ పాప ఉంది. దాంతో వారి సంబంధాన్ని ప్ర‌తిఘ‌టించ‌లేక‌పోయాను. వారి ఇష్టానికే వ‌దిలేశాను... అని చెప్పార‌ట మోనా క‌పూర్‌.

బోనీతో విడిపోయిన త‌రువాత పిల్ల‌లు.. త‌ను న‌ర‌కం చూశామ‌ని చెప్పుకొచ్చింది. స్కూల్ ‌లో పిల్ల‌లు అర్జున్‌, ...అన్షులాని ఏడిపించేవార‌ని భావోద్వేగానికి లోన‌య్యారు. అంతే కాకుండా మోనాని చాలా మంది మీరెందుకు బ‌రువు త‌గ్గ‌డానికి అందంగా వుండ‌టానికి ప్ర‌య‌త్నించ‌రు. అలా చేస్తే బోనీ మిమ్మ‌ల్ని వ‌దిలేసేవాడు కాదుక‌దా!! అని టీజ్ చేసేవార‌ట‌. పిల్ల‌ల‌ని తీసుకుని దూరంగా వెళ్లినా ఏనాడూ బోనీకి ఇబ్బందిని క‌లిగించ‌లేద‌ని... పిల్లలు బోనీతో కాంటాక్ట్ లోనే వున్నార‌ని చెప్పుకొచ్చింది.