Begin typing your search above and press return to search.

శ్రీదేవిని చూసి ఏడవటం ఖాయం

By:  Tupaki Desk   |   26 Jun 2017 10:07 PM IST
శ్రీదేవిని చూసి ఏడవటం ఖాయం
X
ఇప్పుడు శ్రీదేవి మరోసారి హాట్ టాపిక్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఒక ప్రక్కన తన 'మామ్' సినిమా పబ్లిసిటీ.. ఇంకో ప్రక్కన కూతురు జాన్వి సినీ ఎంట్రీపై అమ్మడు మ్యారేజ్ బెటర్ అని కామెంట్ చేసి మళ్ళీ మాట మార్చడం.. మరో ప్రక్కన బాహుబలి సినిమాలో శివగామి రోల్ చేయడం చేయకపోవడం తన ఇష్టం అని చెప్పడం.. రాజమౌళిని తప్పుబట్టడం.. ఇవన్నీ ఆమెను న్యూసులో ముఖ్యమైన పాత్ర పోషించేలా చేశాయి.

ఇదంతా సరే.. ఇంతకీ ఈ బజ్ అంతా కూడా ''మామ్'' సినిమాను ధియేటర్లలో ఆడించడానికి సరపోతుందా? అదేమో తెలియదు కాని.. ఈ సినిమాలో శ్రీదేవి పెర్ఫార్మెన్స్ చూసినవారెవ్వరైనా కూడా ఏడవకుండా ఉండలేరట. ఇవాళే సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ అందించిన పంకజ్ నిహలానీ.. ''మీరు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా ఏడుస్తారు. అసలు మీ కళ్ళలో తడవని ప్రదేశం అంటూ ఉండదు. ఆ రేంజులో కళ్లమ్మట నీళ్ళొస్తాయి. అప్పుడెప్పుడో మథర్ ఇండియా సినిమాలో నర్గీస్ ఎలా ఏడిపించిందో.. ఇప్పుడు శ్రీదేవి కూడా అదే రేంజులో అదరొట్టేసింద'' అంటూ కామెంట్ చేశాడు. మొత్తానికి మనోడ్ని సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వమంటే రివ్యూలు కూడా ఇచ్చేస్తున్నాడు.

నిజానికి శ్రీదేవి మామ్ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. చాలా ఇంగ్లీష్‌ సినిమాల్లోని ముక్కలు ముక్కలు మనకు కనిపించకమానవు. పైగా ఈ కథను కోన వెంకట్ అందించారంటే.. ఖచ్చితంగా ఇదెక్కడో లేపేసిన బాపతే అనే రూమర్ ఉండనే ఉంది. చూద్దాం మరి ఈ మామ్ ఎలా ఉండబోతుందో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/