Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ ని ఆ స్టార్ డైరెక్టర్ చేతిలో పెడుతున్నారా..?

By:  Tupaki Desk   |   31 May 2022 7:29 AM GMT
మోక్షజ్ఞ ని ఆ స్టార్ డైరెక్టర్ చేతిలో పెడుతున్నారా..?
X
నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నాళ్ళ నుంచో ఇదుగో వస్తున్నాడు.. అదిగో వస్తున్నాడు అంటూ మోక్షు ఎంట్రీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు జరగలేదు. అయితే కొడుకు డెబ్యూ కోసం భారీగా ప్లాన్స్ ఉన్నాయని అప్పట్లో బాలయ్య స్వయంగా వెల్లడించారు.

బాలకృష్ణ తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తీసిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాతో మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలయ్య తనయుడి లాంచింగ్ ఉంటుందని అన్నారు. ఇదే క్రమంలో మరికొందరి పేర్లు తెర మీదకు వచ్చాయి. కానీ ఏదీ నిజం కాలేదు.

ఆ మధ్య మోక్షు కాస్త బొద్దుగా కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందారు. అసలు నందమూరి వారసుడికి సినిమాల మీద ఆసక్తి లేదేమో అనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు మోక్షజ్ఞ జిమ్ క్లాసులు తీసుకుంటూ ఫిజిక్ మీద ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. దీంతో మళ్ళీ బాలయ్య కుమారుడి లాంచ్ గురించి నివేదికలు ఊపందుకున్నాయి.

మోక్షు డెబ్యూ మూవీ కోసం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ని ఫైనలైజ్ చేశారని లేటెస్టుగా టాక్ నడుస్తోంది. 'పటాస్' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనిల్.. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అతని సినిమాల్లో అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా చూసుకుంటారు కాబట్టి.. మోక్షజ్ఞ లాంచింగ్ కు అనిల్ అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నారట.

నిజానికి బాలకృష్ణ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ కోసం అద్భుతమైన స్క్రిప్ట్స్ తీసి పెట్టానని తెలిపారు. 'ఆదిత్య 369' కు సీక్వెల్ గా తన దర్శకత్వంలో తెరకెక్కే 'ఆదిత్య 999 మాక్స్' సినిమా ద్వారా కుమారుడి లాంచింగ్ ఉంటుందని.. 2023లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారని.. అనిల్ చేతుల మీదుగా తెరంగేట్రం చేయించాలని చూస్తున్నారని అంటున్నారు.

గోపీచంద్ మలినేని తో చేస్తున్న #NBK107 సినిమా తర్వాత బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మూవీని స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఇరు వైపుల నుంచి క్లారిటీ వచ్చేసింది. ఇటీవల అనిల్ సినిమా నేపథ్యం గురించి కూడా చెప్పేసారు. ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లముందే నందమూరి వారసుడితో అనిల్ సినిమా చేస్తారని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.