Begin typing your search above and press return to search.

న్యూ బజ్: ఎన్టీఆర్ సెట్స్ లో మోక్షజ్ఞ

By:  Tupaki Desk   |   8 Dec 2018 6:21 AM GMT
న్యూ బజ్: ఎన్టీఆర్ సెట్స్ లో మోక్షజ్ఞ
X
నందమూరి బాలకృష్ణ - క్రిష్ కాంబినేషన్లో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. ఈమధ్య చిత్రం షూటింగ్ జరుగుతున్న లొకేషన్ కు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సర్ ప్రైజ్ విజిట్ చేశాడట. ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ లొకేషన్ కు మోక్షజ్ఞ రావడం ఇదే మొదటిసారి కావడంతో అక్కడ సందడి నెలకొందట.

ఎన్టీఆర్ బయోపిక్ ఒక పీరియాడికల్ ఫిలిం లాంటిది కావడంతో ఈ సినిమా కోసం రామోజి ఫిలిం సిటీలో ప్రత్యేకమైన సెట్స్ నిర్మించారు. ఆ సెట్స్ ను లొకేషన్ ను.. చూడడానికే మోక్షజ్ఞ సర్ ప్రైజ్ విజిట్ చేశాడని కొందరు అంటున్నారు. కానీ ఈ సినిమాలో మోక్షజ్ఞ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే షూటింగ్ లొకేషన్ కు వచ్చాడనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా ఒక క్యామియోతో మోక్షజ్ఞ ను తెలుగు తెరకు పరిచయం చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి గానీ అటు బాలయ్య గానీ ఇటు దర్శకుడు క్రిష్ గానీ ఆవిషయాన్ని కన్ఫాం చేయలేదు. మరి తెలుగు ప్రేక్షకులందరికీ ఈ విషయంలో సర్ ప్రైజ్ ఇస్తారేమో వేచి చూడాలి.