Begin typing your search above and press return to search.

ఆ మూడు ముద్దులూ సెన్సార్ వారికి ఓకె

By:  Tupaki Desk   |   1 Aug 2016 4:00 AM GMT
ఆ మూడు ముద్దులూ సెన్సార్ వారికి ఓకె
X
సెన్సార్ బోర్డ్ ఈ మధ్య బాగా యాక్టివ్ అయిపోయింది. సీబీఎఫ్సీ చీఫ్ గా పంకజ్ నిహ్లానీకి పగ్గాలు ఇచ్చాక ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా ముద్దుల విషయంలో అయితే.. సెన్సార్ వాళ్ల కత్తెరకు బాగా పదును పెరిగింది కూడా. ఆఖరికి జేమ్స్ బాండ్ సినిమాని కూడా వదలకుండా ముద్దులకు కోత పెట్టేశారు.

అయితే.. హృతిక్ రోషన్-పూజా హెగ్డే జంటగా నటించిన మొహెంజొదారో మూవీ మాత్రం ఈ కోతల నుంచి తప్పించేసుకుంది. ఆగస్ట్ 12 విడుదల కానున్న మొహెంజొదారో చిత్రంలో.. మూడు మాంచి కిస్సింగ్ సీన్లు ఉన్నాయట. అయితే.. వీటిలో ఒక్క లిప్ లాక్ ని కూడా కట్ చేయలేదట సెన్సార్ బోర్డ్. కనీసం ట్రిమ్ కూడా చేయకుండానే అనుమతి ఇచ్చేశారు. అంటే ఆ మూడు ముద్దులు సెన్సార్ వాళ్లకి ఓకే అని చెప్పాల్సిందే. కిస్సింగ్ సీన్లను కట్ చేయకపోవడంపై హృతిక్ స్పందించాడు.

తాను ఎటువంటి కట్స్ ని ఎక్స్ పెక్ట్ చేయలేదని.. ఆ ముద్దు సీన్లు అంతగా మనసును హత్తుకునేలా ప్రేమని చాటేలా ఉంటాయన్నాడు హృతిక్. ఎంత అందంగా తీసినా.. ఏకంగా మూడు ముద్దులకు సెన్సార్ కత్తెర పడకపోవడాన్ని మొహెంజొదారో మూవీ మేకర్స్ అదృష్టంగానే చెప్పాలి.