Begin typing your search above and press return to search.

మొహెంజదారో ఫస్ట్ లుక్.. వావ్

By:  Tupaki Desk   |   7 Jun 2016 10:21 AM GMT
మొహెంజదారో ఫస్ట్ లుక్.. వావ్
X
ఫస్ట్ లుక్ పోస్టర్ అంటే హీరోనో హీరోయిన్నో చూపించడం సహజం. ఐతే అలా ఏమీ చూపించకుండానే ‘వావ్’ అనిపించాడు అశుతోష్ గోవారికర్. తన కొత్త సినిమా ‘మొహెంజదారో’కు సంబంధించి ఈ రోజు ఆయన రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ జనాలకు పిచ్చికెక్కించేసింది. ఇలాంటి ఓ పోస్టర్ నభూతోనే అని చెప్పాలి. శతాబ్దాల కిందట మొహెంజదారో కల్చర్ నేపథ్యంలో హృతిక్ రోషన్-పూజా హెగ్డే జంటగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు అశుతోష్. పోస్టర్లో చూపించింది మొహెంజదారో సంస్కృతికి సంబంధించిన కట్టడాల్ని పోలిన రూపంగా భావిస్తున్నారు. పైన అక్షరాలు నాటి శాసనాల నుంచి తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

తొలి సినిమా ‘లగాన్’ నుంచి భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడు అశుతోష్. చరిత్ర నేపథ్యంలో సినిమాలు తీయడం ఆయనకు మహా ఇష్టం. ఇంతకుముందు హృతిక్ హీరోగా ‘జోధా అక్బర్’ తీసి మెప్పించాడు. ‘మొహెంజదారో’ బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా చెబుతున్నారు. ఈ సినిమా కోసం అశుతోష్ నాలుగేళ్లుగా శ్రమిస్తున్నాడు. హృతిక్ కూడా రెండేళ్లుగా ఈ సినిమాకే అంకితమైపోయాడు. పూజా హెగ్డే సైతం తెలుగు సినిమాల్లో మంచి మంచి అవకాశాలు వదులుకుని ఈ సినిమాకే తన సమయాన్నంతా డెడికేట్ చేసింది. సిద్దార్థ్ రాయ్ కపూర్ తో కలిసి అశుతోష్ స్వయంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.