Begin typing your search above and press return to search.

రెండేళ్ల ట్రైనింగ్ తీసుకోనున్నాడు

By:  Tupaki Desk   |   22 April 2017 4:20 PM GMT
రెండేళ్ల ట్రైనింగ్ తీసుకోనున్నాడు
X
సూపర్ స్టార్ అనే స్టేటస్ అందుకోవడం అంటేనే.. బోలెడంత అనుభవం.. సక్సెస్.. క్రేజ్ సంపాదించేసుకున్నారని లెక్క. అయినా సరే ఇంకా నటనలో ట్రైనింగ్ తీసుకుంటున్నారంటే అది వారి కమిట్మెంట్ కి నిదర్శనం.

కానీ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక సినిమా కోసం ఏకంగా రెండేళ్ల పాటు కంటిన్యూగా శిక్షణ తీసుకుంటూనే ఉంటారట. దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో మహాభారతం తెరకెక్కించేందుకు రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. భీముని కోణంలోంచి మహాభారతం పై ప్రముఖ రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్ రచించిన రండామూఝం పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. దీనికోసం ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించగా.. ఈ సినిమాలో భీముని పాత్ర కోసం ఇప్పటి నుంచే ట్రైనింగ్ తీసుకుంటారట మోహన్ లాల్.

ఇప్పుడు పనులు ప్రారంభించి.. ఓ ఏడాది తర్వాత సినిమా ప్రారంభించాలన్నది దర్శకుడు విఏ శ్రీకుమార్ ఆలోచన. అంతా పూర్తయి.. ఈ చిత్రం రిలీజ్ అయేందుకు 2020 వచ్చేస్తోంది. రెండు భాగాలుగా రూపొందే ఈ మూవీని.. 90 రోజుల గ్యాప్ లో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దుబాయ్ బేస్డ్ బిజినెస్ మ్యాన్ బీఆర్ శెట్టి ఈ భారీ బడ్జెట్ మహా భారతం నిర్మాత.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/