Begin typing your search above and press return to search.

బ్లాక్ మెజీషియ‌న్ గా మోహ‌న్ లాల్‌!

By:  Tupaki Desk   |   29 July 2017 12:20 PM GMT
బ్లాక్ మెజీషియ‌న్ గా మోహ‌న్ లాల్‌!
X
మ‌ల‌యాళ స్టార్ హీరో మోహ‌న్ లాల్ కు మాలీవుడ్ లో చాలా క్రేజ్ ఉన్నసంగ‌తి తెలిసిందే. ఆయ‌న విల‌క్ష‌ణమైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంటారు. ప్ర‌స్తుతం మోహ‌న్ లాల్ మల‌యాళంలో ఒడియాన్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో సగం మ‌నిషి...సగం మృగంగా మోహ‌న్ లాల్ క‌నిపించ‌బోతున్నార‌ట‌. డార్క్ నెస్ మిథిక‌ల్ కింగ్ మ‌ణిక్క‌న్ పాత్ర‌లో మోహ‌న్ లాల్‌ అల‌రించ‌బోతున్నార‌ట‌. మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇదే కావ‌డం విశేషం.

ఈ సినిమాకు శ్రీ‌కుమార్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. చ‌రిత్ర‌, జాన‌ప‌దం క‌ల‌గ‌లిసిన ఒక వెరైటీ స్టోరీని తెర‌కెక్కిస్తున్నాన‌ని మీన‌న్ తెలిపారు. 1950-2000 మ‌ధ్య జ‌రిగిన క‌థ‌ను ఈ చిత్రంలో ఆస‌క్తిక‌రంగా చూపించ‌బోతున్నార‌ట‌. త‌ల్లి క‌డుపులోని బిడ్డ‌ను కూడా ఆమెకు తెలియ‌కుండా మాయం చేయ‌గ‌ల బ్లాక్ మెజీషియ‌న్ క‌థ ఈ చిత్రంలో ఉంటుంద‌ట‌.

ఈ సినిమా కోసం మోహ‌న్ లాల్ ప్ర‌త్యేకంగా బ‌రువు త‌గ్గార‌ట‌. రీసెంట్ గా జ‌న‌తా గ్యారేజ్‌, మ‌న‌మంతా చిత్రాల‌తో మ‌ల‌యాళ స్టార్ హీరో మోహ‌న్ లాల్ కు తెలుగులో మంచి గుర్తింపు వ‌చ్చింది. దీంతో, ఈ మ‌ల‌యాళ భారీ బ‌డ్జెట్ మూవీని కూడా తెలుగులో విడుద‌ల‌కు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.