Begin typing your search above and press return to search.

20 ఏళ్ల తర్వాత ఇద్దరు కలసి

By:  Tupaki Desk   |   29 March 2017 10:31 PM IST
20 ఏళ్ల తర్వాత ఇద్దరు కలసి
X
దక్షిణాది సినీ పరిశ్రమకే కాదు.. మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ప్రముఖంగా నిలిచే పేర్లలో మోహన్ లాల్.. ప్రకాష్ రాజ్ కచ్చితంగా ఉంటారు. 20 ఏళ్ల క్రితం మణిరత్నం రూపొందించిన మూవీ 'ఇద్దరు'లో వీరిద్దరూ కలిసి నటించారు.

తమిళ రాజకీయాల ఆధారంగా రూపొందిన ఇద్దరు తర్వాత.. మళ్లీ ఈ రెండు దశాబ్దాలలో మోహన్ లాల్.. ప్రకాష్ రాజ్ కలిసి నటించే సందర్భం రాలేదు. కానీ మళ్లీ ఇప్పుడు మహానటులు అనదగ్గ వీరిద్దరు ఎదురెదురుగా పోటీపడి తమ ట్యాలెంట్ చూపించబోతున్నారు. ఒడియన్ అంటూ రూపొందనున్న కొత్త చిత్రంలో.. మోహన్ లాల్ లీడ్ రోల్ చేస్తుండగా.. ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో కనిపించనుండడం విశేషం. 3డీ టెక్నాలజీ ఆధారంగా తెరకెక్కనున్న ఈ మూవీలో మంజు వారియర్ హీరోయిన్ గా కనిపించనుంది.

మే 25న ఒడియన్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. ప్రముఖ యాడ్ ఫిలిం మేకర్ శ్రీకుమార్ మీనన్.. దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నాడు. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కనున్న ఒడియన్ లో ఇంకా బోలెడన్ని విశేషాలు ఉంటాయట. ఒక్కొక్కటిగా వీటిని బయటపెడుతూ ఆసక్తి విపరీతంగా పెంచేలా దర్శకుడు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/