Begin typing your search above and press return to search.
'మరక్కార్' గ్రాండ్ ట్రైలర్: పోరాట యోధుడి వీరగాధ..!
By: Tupaki Desk | 1 Dec 2021 9:29 AM ISTకంప్లీట్ యాక్టర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ''మరక్కార్''. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'అరేబియా సముద్ర సింహం' అనేది ట్యాగ్ లైన్. విడుదలకు ముందే మూడు నేషనల్ అవార్డులను సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది.
డిసెంబర్ 3న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మరక్కర్’ గ్రాండ్ ట్రైలర్ ను సోమవారం లాంచ్ చేశారు. శౌర్యం యొక్క ఎపిక్ దేశభక్తి కథను ప్రేక్షకులను అందించబోతున్నట్లు ఈ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ వివరిస్తోంది. 16వ శతాబ్దంలో పోర్చుగీసువారిని ఎదురించి పోరాడిన కేరళ నావికాధికారి కుంజాలీ మరక్కర్ గా మోహన్ లాల్ కనిపించాడు.
పోరాట యోధుడైన అరేబియా సింహం కుంజలి మరక్కర్ యొక్క ఆధిపత్యాన్ని అంతం చేయడానికి 6000 మంది సైన్యంతో మోహరించమని పోర్చుగీస్ నాయకుడు ఆదేశించడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. చనిపోయిన లేదా సజీవంగా మరక్కర్ తల తీసుకొచ్చి తన పాదాల వద్ద పడేయాలని పోర్చుగీస్ జనరల్ నోటీసు జారీ చేస్తాడు. ఒక గొప్ప పోరాట యోధుడు నేరస్తుడిగా ఎలా మారాడు? అనే ప్రశ్న లేవనెత్తారు. సముద్రంలో జరిగే యుద్ధ సన్నివేశాలు.. మధ్య మధ్యలో మరక్కర్ తన తల్లి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యే సీన్స్ ను కూడా ఈ ట్రైలర్ లో చూడొచ్చు.
దర్శకుడు ప్రియదర్శన్ ప్రత్యేకమైన సెట్స్ - కాస్ట్యూమ్స్ - ఆయుధాల పరంగా 16 శతాబ్దం కాలాన్ని తిరిగి సృష్టించగలిగాడు. ఈ ఎపిక్ పీరియడ్ డ్రామాలో కీర్తి సురేష్ - అర్జున్ సర్జా - మంజు వారియర్ - అశోక్ సెల్వన్ - సునీల్ శెట్టి - ప్రభు - సిద్ధిఖ్ - సుహాసిని మణిరత్నం - నెడుముడి వేణు కీలక పాత్రలు పోషించారు. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ - ప్రియదర్శన్ కుమార్తె, 'హలో' ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ కూడా ఇందులో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
హాలీవుడ్ సినిమాలను తలపించే అద్బుతమైన విజువల్స్ - రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో గ్రాండియర్ గా ఉన్న 'మరక్కర్' ట్రైలర్ మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. మలయాళ సినిమా స్థాయిని పెంచేలా దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఇది ఇప్పటివరకు అత్యంత ఖరీదైన మలయాళ చిత్రంగా నిలిచింది.
‘బాహుబలి’ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరు ఈ సినిమా కోసం వర్క్ చేశారు. రోనీ రాఫెల్ సంగీతం సమకూర్చగా.. అంకిత్ సూరి - రాహుల్ రాజ్ - లయెల్ ఎవాన్స్ రోడెర్ నేపథ్య సంగీతం అందించారు. అయ్యప్పన్ నాయర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఆశీర్వాడ్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ సినిమాని నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో 'మరక్కార్' చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు విడుదల చేస్తున్నారు.