Begin typing your search above and press return to search.
ఓటీటీ రిలీజ్ సంక్షోభం ముదురుతోందా? స‌్టార్ హీరోలే ఇలా చేస్తే ఎలా?
By: Tupaki Desk | 5 Jan 2021 9:33 AM ISTకరోనా మహమ్మారీ వల్ల తీవ్రంగా నష్టపోయిన రంగం ఏదైనా ఉంది అంటే అది సినీపరిశ్రమ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఎగ్జిబిషన్ రంగంపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. ఈ రంగంలో చాలామంది కార్మికులు ఉపాధిని కోల్పోగా .. థియేటర్లను కళ్యాణ మంటపాలుగా మార్చేందుకు రెడీ అవుతుండడం ఇటీవల చర్చనీయాంశమైంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లు ఈ తరహాలో వేరే వ్యాపారాలకు వినియోగించే పరిస్థితి ఉందన్న సమాచారం ఉంది.
అయితే ఇలాంటి క్రైసిస్ సమయంలో అన్ లాక్ ప్రక్రియతో థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతించాయి. మహమ్మారీ ప్రభావం మునుపటితో పోలిస్తే తగ్గుముఖం పట్టింది. జనాల్లో భయాందోళనలు తగ్గడంతో థియేటర్లకు జనం వస్తారన్న ధీమా పెరిగింది. అయితే ఇలాంటి సమయంలో పలువురు స్టార్ హీరోలు ఓటీటీ రిలీజ్ లకు వెళుతుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇన్నాళ్ల తర్వాత అయినా ఎగ్జిబిషన్ రంగాన్ని ఆదుకోవాల్సిన స్టార్ హీరోలే ఇలా చేస్తున్నారా? అన్న చర్చా సాగుతోంది.
టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున నటించిన వైల్డ్ డాగ్.. మాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 ఓటీటీ రిలీజ్ లకు సిద్ధమవుతున్నాయి. నిజానికి అంత పెద్ద స్టార్లు కాస్త ఓపిక పట్టి థియేట్రికల్ రిలీజ్ చేస్తే తప్పేమీ కాదన్న విమర్శలు ఉన్నాయి.
కానీ ఎవరూ వేచి చూసే ధోరణితో లేరు. ఏదోలా పెట్టుబడుల్ని రికవరీ చేసేందుకే ఓటీటీలో రిలీజ్ చేసేయాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇంతకుముందు తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా (సూరరై పోట్రు) ని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లో ఎగ్జిబిటర్లంతా సూర్యపై చాలా సీరియస్ అయ్యారు. ఇప్పటికీ ఎగ్జిబిషన్ అసోసియేషన్లు సూర్యపై కక్ష కట్టాయన్న చర్చా కోలీవుడ్ లో సాగుతోంది. ఇక క్రైసిస్ తీవ్రంగా ఉన్న సమయంలోనే జ్యోతిక నటించిన సినిమాని కూడా సూర్య డిజిటల్ లోనే రిలీజ్ చేసుకుని రికవరీ సాధించారు.
అయితే అప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు వేరు. ఇప్పుడిప్పుడే థియేట్రికల్ రిలీజ్ లతో పలువురు హీరోలు డేర్ చేస్తుంటే .. స్టార్ హీరోలు అయిన నాగార్జున.. మోహన్ లాల్ ఎందుకని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సిద్ధంగా లేరు? అన్న ప్రశ్న తలెత్తింది. ఎగ్జిబిటర్లలో దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అలాంటి క్రేజీ సినిమాల్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తే దానివల్ల జనాల్ని రప్పించే వీలుంటుంది.