Begin typing your search above and press return to search.
చిరు సినిమాకు 24 ఏళ్ల క్రితం కో ప్రొడ్యూసర్.. ఇప్పుడు డైరెక్టర్
By: Tupaki Desk | 4 Jan 2021 11:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి లూసీఫర్ రీమేక్ దర్శకుడు కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి లూసీఫర్ రీమేక్ ను చేయబోతున్నాడు. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ నెలలోనే లూసీఫర్ రీమేక్ పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఈ సమయంలోనే చిరంజీవి నటించిన హిట్లర్ మూవీ 24 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా దర్శకుడు మోహన్ రాజా ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. నాన్న ఎడిటర్ మోహన్ నిర్మించిన 'హిట్లర్' సినిమా లో అప్పట్లోనే కో ప్రొడ్యూసర్ గా చేసినందుకు గర్వంగా ఉందని మోహన్ రాజా సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.
24 ఇయర్స్ ఆఫ్ చిరంజీవి హిట్లర్ అనే హ్యాష్ ట్యాగ్ ను షేర్ చేసిన మోహన్ రాజా మెగాస్టార్ 153 అప్ డేట్ త్వరలో అంటూ ట్వీట్ చేశాడు. 24 ఏళ్ల క్రితం చిరంజీవి సినిమాకు కో ప్రొడ్యూసర్ గా చేసిన మోహన్ రాజా మళ్లీ ఇన్నాళ్లకు ఆయన్ను డైరెక్ట్ చేయడం ఒక అరుదైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. చిరంజీవి తో ఎంతో మంది దర్శకులు సినిమా చేసేందుకు వెయిట్ చేస్తుంటే మోహన్ రాజా ఆ రీమేక్ బాధ్యతలు దక్కించుకున్నాడు. మరి ఆ బాధ్యతలను ఎంత వరకు మోహన్ రాజా నెరవేర్చుతాడు అనేది చూడాలి. లూసీఫర్ రీమేక్ ఫలితాన్ని బట్టి చరణ్ కూడా మోహన్ రాజా దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉందంటున్నారు.