Begin typing your search above and press return to search.

వేదాళం వెనక్కి.. లూసిఫర్ ముందుకు!

By:  Tupaki Desk   |   16 Dec 2020 11:00 PM IST
వేదాళం వెనక్కి.. లూసిఫర్ ముందుకు!
X
మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ చిత్రం తర్వాాత మరో రెండు చిత్రాలను లైన్లో పెట్టారు చిరు. అవి రెండూ రీమేకులే. ఒకటి వేదాళం, మరొకటి లూసిఫర్. అయితే.. ఇందులో ఏ చిత్రం ముందుగా మొదలు పెడతాారన్నది నిన్నా మొన్నటి వరకూ తేలలేదు. పలు తర్జనభర్జనల అనంతరం లూసిఫర్ కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి.

డైెరెక్టర్ ఆయనే..
ఈ చిత్రాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలనే విషయంలోనూ బాగానే డిస్కస్ చేశాారు. సుజిత్, వీవీ వినాయక్ పేర్లు వినిపించాయి. కానీ.. చివరకు ఆ అవకాశం మోహన్ రాజాకు దక్కింది. మోహన్ రాజాకు తమిళంలో రీమేక్ స్పెషలిస్ట్‌గా పేరుంది. అందువల్లే ఈ పొలిటికల్ థ్రిల్లర్ డైరెక్షన్ బాధ్యతలు మోహన్ రాజాకు అప్పగించారని సమాచారం. ప్రస్తుతం ‘ఆచార్య’లో చిరంజీవి పార్ట్ డిసెంబర్ ఎండింగ్ లోగా పూర్తవుతుంది. దీంతో.. జనవరి నుండి లూసిఫర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది.

ఆయన మనకు పరిచయస్థుడే..
లూసీఫర్ డైరెక్టర్ మోహన్ రాజా తెలుగువారికి తెలిసినవాడే. ఎడిటర్ మోహన్ కుమారుడే ఈ మోహన్ రాజా. హనుమాన్ జంక్షన్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ డైరెెక్టర్.. ఆ తర్వాత తమిళనాటకు వెళ్లిపోయాడు. ఆ మధ్యలో ‘సమ్ థింగ్..సమ్ థింగ్’ సినిమాను కూడా రూపొందించాడు. ఇప్పుడు లూసిఫర్ తో మళ్లీ వస్తున్నాడు.

కారణం ఇదేనట..
లూసిఫర్ సినిమా చూసి బాగా ఇంప్రెస్ అయిన రామ్ చరణ్.. ఈ చిత్రాన్ని తండ్రితో రీమేక్ చేయించాలని డిసైడ్ అయ్యాడట. అంతేకాకుండా.. నిర్మాత ఎన్వీ ప్రసాద్ చేత ఆయనే కొనిపించారట. అందువల్ల ఎలాగైనా ఆ సినిమాను ముందుగా పూర్తి చేయాలని రామ్ చరణ్ పట్టుపట్టినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే వేదాళం కన్నా ముందుగా లూసీఫర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోందని టాక్.

వేసవిలో వేదాళం..
లూసిఫర్ షూట్ పూర్తి చేసిన తర్వాత, అంటే.. వేసవిలో వేదాళం రీమేక్ సెట్స్ పైకి వెళ్తుందట. దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. ఏదిఏమైనా.. రాబోయే ఏడాది కాలంలో ఈ మూడు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నారట మెగాస్టార్.