Begin typing your search above and press return to search.

కొరటాలపై 'మనమంతా' ప్రభావం??

By:  Tupaki Desk   |   10 Aug 2016 5:49 PM GMT
కొరటాలపై మనమంతా ప్రభావం??
X
ఇప్పుడు 'మనమంతా' సినిమా రిలీజవ్వడంతో దర్శకుడు కొరటాల శివకు కాస్త టెన్షన్ వచ్చి పడింది. ఎందుకంటే ఈ సినిమాకూ ఆ సినిమాకూ ఒకటే ఒక లింకుంది. అదే మోహన్ లాల్‌. ఆయన కారణంగానే ఇప్పుడు ఒక టెన్షన్ వచ్చిందట. ఏంటది? ప్రమోషన్లకు రానన్నాడా ఆయన లేకపోతే ఇంకోటేదైనా ప్రాబ్లం వచ్చిందా? పదండి చూద్దాం.

నిజానికి మోహన్ లాల్ తానే స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటే అంటే.. ఇంకో దర్శకుడు ఎవరైనా కాస్త జంకేవారేమో కాని.. చంద్రశేఖర్ ఏలేటి మాత్రం మనమంతా సినిమాకు ధైర్యంగా చెప్పించేశాడు. దానితో ఆ సినిమాకు ఒక కొత్త ఫ్లావర్ వచ్చినట్లయింది. సినిమా చూస్తున్నంతసేపూ మోహన్ లాల్ మాత్రమే కాదు.. ఆయన వాయిస్ కూడా సమ్మోహనంగా ఉంది. అయితే ఈ వాయిస్ ను ఇప్పుడు జనతా గ్యారేజ్ లో పెట్టకపోతే ఎలా ఉంటుంది? హీరో హీరోయిన్ వాయిస్ ఫ్లక్చువేషన్‌ కారణంగా చాలా సినిమాలు ఫెయిల్ అయ్యాయ్ కూడా. డబ్బింగ్ ఆర్టిస్టును మారిస్తే చాలు.. సినిమాలు ఫ్లాపే. అందుకే కొంతమంది ఒకే డబ్బింగ్ ఆర్టిస్టుతో చెప్పించుకుంటూ ఉంటారు.

కాని జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ వాయిస్ ను ఆల్రెడీ ఎవరితోనో డబ్ చేయించారట. ఇప్పుడు మనమంతా సినిమాలో ఆయన ఒరిజినల్ వాయిస్ కు అందరూ కనక్టయ్యారు కాబట్టి.. సడన్ గా వచ్చే నెలలో ఆయన డబ్బింగ్ వాయిస్ తో ఒక సినిమా వస్తే.. అది జనాలకు సింక్ అవుతుందా? సరిగ్గా కొరటాల కూడా ఇదే ఆలోచిస్తున్నాడంట. చూద్దాం ఏం చేస్తాడో.