Begin typing your search above and press return to search.

బన్నీకి చెక్‌ పెట్టేందుకు సూపర్‌ స్టార్‌ ను కోరుతున్న ‘R’ స్టార్స్‌

By:  Tupaki Desk   |   2 April 2020 3:53 AM GMT
బన్నీకి చెక్‌ పెట్టేందుకు సూపర్‌ స్టార్‌ ను కోరుతున్న ‘R’ స్టార్స్‌
X
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్‌ ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగన్‌ ఇంకా ఆలియా భట్‌ లు ఈ చిత్రంలో నటించడంతో అక్కడ విపరీతమైన మార్కెట్‌ ను కలిగి ఉంది. ఇక తమిళ స్టార్స్‌ కూడా ఈ సినిమాలో ఉన్న కారణంగా తమిళంలో కూడా ఈ సినిమా మంచి బిజినెస్‌ చేయడం కన్ఫర్మ్‌ గా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కేరళలో మాత్రం ఈ సినిమా బజ్‌ అంతగా లేదు. అందుకే మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ ను ఇందులో నటింపజేయాలనే ఆలోచన యూనిట్‌ సభ్యుల్లో ఉందని వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా హీరోలు ఎన్టీఆర్‌.. రామ్‌ చరణ్‌ లు ఇద్దరు కూడా కేరళలో పెద్దగా క్రేజ్‌ ను ఇప్పటి వరకు సంపాదించుకోవడంలో విఫలం అయ్యారు అనే విషయం తెల్సిందే. టాలీవుడ్‌ నుండి అల్లు అర్జున్‌ కు మాత్రమే మలయాళంలో స్టార్‌ స్టేటస్‌ ఉంది. ఇతర తెలుగు హీరోలను అక్కడ జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు అనే టాక్‌ ఉంది. ఈ సమయంలో అక్కడ జెండా పాతేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్‌ కు అక్కడ గుర్తింపు వచ్చింది. ఆ స్థాయి గుర్తింపు అయినా రావాలి అంటే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో మలయాళ సూపర్‌ స్టార్‌ నటించాలని హీరోలు ఇద్దరు కూడా జక్కన్న వద్ద పోరు పెడుతున్నారట.

ఏదో ఒక చిన్న పాత్రకు అయినా మోహన్‌ లాల్‌ ను ఈ సినిమాలో భాగస్వామ్యం చేస్తే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంతో పాటు మార్కెట్‌ పెరుగుతుందని హీరోలు అభిప్రాయ పడుతున్నారట. తద్వారా తమకు కూడా అక్కడ మంచి గుర్తింపు దక్కుతుందనే నమ్మకంతో హీరోలు ఉన్నారు. అయితే ఇప్పటికే షూటింగ్‌ మెజార్టీ పార్ట్‌ పూర్తి అయ్యింది. ఈ సమయంలో మోహన్‌ లాల్‌ ను ఏదో ఒక పాత్రలో జొప్పించడం సాధ్యం కాకపోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే.. జక్కన్న తల్చుకుంటే సాధ్యం కాకపోవడానికి ఏమీ లేదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరి హీరోల కోరికను జక్కన్న తీర్చుతాడా అనేది చూడాలి.