Begin typing your search above and press return to search.

జూనియర్ అభిమానులకు మోహన్ లాల్ సారీ

By:  Tupaki Desk   |   12 Aug 2016 11:01 PM IST
జూనియర్ అభిమానులకు మోహన్ లాల్ సారీ
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ అంగరంగవైభవంగా జరిగింది. తెలుగు, మలయాళ ఇండస్ట్రీలకు చెందిన హేమాహేమీలు ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు. అయితే.. అనారోగ్యం కారణంగా హీరోయిన్ సమంత ఈ వేడుకకు హాజరు కాలేకపోగా.. జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ తర్వాత లీడ్ రోల్ చేసిన మోహన్ లాల్ కూడా ఫంక్షన్ కి రాలేదు.

తను రాలేకపోయినా.. అందుకు కారణం చెబుతూ వీడియో షూట్ చేసి పంపారు మోహన్ లాల్. 'టైట్ షూట్ షెడ్యూల్స్ కారణంగానే రాలేక పోతున్నా. ఇంత పెద్ద ఫంక్షన్ కు వచ్చేందుకు వీలైనంతవరకూ ట్రై చేసాను. కానీ రాలేక పోయాను. అందరికీ సారీ. ఓనం పండుగకు కేరళలో కొత్త సినిమాలు రిలీజ్ చేసేందుకు అందరూ ట్రై చేస్తారు. ఓనం సందర్భంగా నేను-ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ రిలీజ్ అవుతున్నందుకు సంతోషిస్తున్నా' అని చెప్పారు మోహన్ లాల్.

జనతా గ్యారేజ్ షూటింగ్ లో చాలానే జ్ఞాపకాలు ఉన్నాయని.. ఇండస్ట్రీలో బెస్ట్ అనేవాళ్లతో పని చేశానన్న మోహన్ లాల్.. 'రామారావు జూనియర్ తారక్.. మై లవబుల్ బ్రదర్' అనడంతో.. ఆడిటోరియం అంతా అదిరిపోయింది. నన్ను సపోర్ట్ చేసిన తెలుగు సినిమా ఇండస్ట్రీకి కృతజ్ఞతలు చెప్పారు మోహన్ లాల్.