Begin typing your search above and press return to search.

యేలేటి-మోహన్ లాల్ భలే కుదిరింది

By:  Tupaki Desk   |   6 Jan 2016 7:51 AM GMT
యేలేటి-మోహన్ లాల్ భలే కుదిరింది
X
తెలుగు పరిశ్రమ గర్వించదగ్గ కొత్త తరం దర్శకుల్లో చంద్రశేఖర్ యేలేటి ఒకడు. ‘ఐతే’ దగ్గర్నుంచి ‘సాహసం’ వరకు అతడిది వైవిధ్యమైన ప్రయాణం. కమర్షియల్ ఎన్ని సక్సెస్‌ లు అందుకున్నాడు.. అతడి సినిమాలు ఎన్ని కోట్లు వసూలు చేశాయి.. అన్నది పక్కనబెడితే వైవిధ్యం కోరుకునే ప్రేక్షకుల్ని మాత్రం యేలేటి సినిమాలు ఎప్పుడూ నిరాశ పరచలేదు. ‘సాహసం’ సినిమా కూడా కమర్షియల్ గా అంత మంచి ఫలితాన్నివ్వకపోయినా.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని మాత్రం పంచింది. ఆ సినిమా తర్వాత కొంచెం ఎక్కువ గ్యాపే వచ్చింది యేలేటికి. ఐతే ఈ గ్యాప్ తర్వాత బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు యేలేటి.

సాయి కొర్రపాటి నిర్మాణంలో మొత్తం దక్షిణాది సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించే సినిమా మొదులపెట్టాడు యేలేటి. మోహన్ లాల్ లాంటి మలయాళ సూపర్ స్టార్.. గౌతమి లాంటి మరో సీనియర్ ఆర్టిస్ట్.. ఇర్ఫాన్ ఖాన్ లాంటి ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న బాలీవుడ్ యాక్టర్.. ఈ ముగ్గురి కాంబినేషన్లో ఓ వైవిధ్యమైన సినిమాకు యేలేటి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చడీచప్పుడు లేకుండా మొదలై.. శరవేగంగా సాగిపోతోంది. ఈ షూటింగులో యేలేటి, మోహన్ లాల్ కెమిస్ట్రీ చాలా బాగా వర్కవుటవుతోందట. యేలేటి పనితీరుకు మోహన్ లాల్ ముగ్ధుడయ్యాడని.. ఆన్ ద సెట్స్ స్క్రిప్టు మరింత బెటర్ కావడానికి సాయం కూడా చేస్తున్నాడని.. మోహన్ లాల్ ఇచ్చిన కొన్ని క్రియేటివ్ ఇన్ పుట్స్ విని యేలేటి మెస్మరైజ్ అయ్యాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఆసక్తికర కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.