Begin typing your search above and press return to search.

`V- ది మూవీ` సీక్వెల్ ఉండొచ్చ‌న్న ఇంద్ర‌గంటి

By:  Tupaki Desk   |   2 Sept 2020 5:00 AM IST
`V- ది మూవీ` సీక్వెల్ ఉండొచ్చ‌న్న ఇంద్ర‌గంటి
X
ఒక మంచి సినిమా తీసి ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వ‌స్తే మ‌న‌సుకు ఎంత క‌ష్టంగా ఉంటుందో ఇంద్ర‌గంటిని చూస్తే అర్థ‌మ‌వుతుంది. మ‌న‌సా వాచా క‌ర్మ‌ణా ఎంతో శ్ర‌ద్ధ పెట్టి ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుని లావిష్ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించిన ఈ సినిమాని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాల‌ని దాదాపు ఐదారు నెల‌లుగా వేచి చూస్తూనే ఉన్నారు ఆయ‌న‌. నాని.. సుధీర్ బాబు.. దిల్ రాజు సైతం ఎట్టి ప‌రిస్థితిలో ఇలాంటి గ్రేట్ మూవీ థియేట‌ర్ల‌లో వ‌స్తేనే బావుంటుంద‌నే అభిప్రాయంతోనే ఉన్నారు.

కానీ అనుకున్న‌ది ఒక్క‌టి అయిన‌ది ఒక్క‌టి! అన్న చందంగానే అయ్యింది. ఎంత మంచి ప్రొడ‌క్ట్ రెడీ చేసినా ఇప్పుడు కేవ‌లం ఓటీటీలో మాత్ర‌మే రిలీజ్ చేయాల్సిన ప‌రిస్థితి ఉంది. సెప్టెంబ‌ర్ 5న అమెజాన్ ప్రైమ్ లో మొత్తం 200 దేశాల్లో తెలుగువారంతా వీక్షిస్తారు.

తాజా ఇంట‌ర్వ్యూలో ఇంద్ర‌గంటి మాట్లాడుతూ..``నా కెరీర్ లో మ‌రో లెవ‌ల్ సినిమా ఇది. మిస్ట‌రీ యాక్ష‌న్ ఎమోష‌న‌ల్ డ్రామా ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంది. ముఖ్యంగా స్టైల్ కంటెంట్ బ‌డ్జెట్ ప‌రంగా నంబ‌ర్ వ‌న్ సినిమా ఇది. అంద‌రినీ మెప్పిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ చూస్తే సీక్వెల్ తీస్తారా? అన్న సందేహం క‌లుగుతుంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ సీక్వెల్ గురించి ఆలోచించ‌లేదు`` అని తెలిపారు. థియేట్రిక‌ల్ రిలీజ్ కోస‌మే ఇన్నాళ్లు వేచి చూసాం. కానీ థియేట‌ర్లు ఎప్పుడు తెరుస్తారో ఇంకా క్లారిటీ రాలేదు. అందుకే ఇక ఆపే ఉద్ధేశం లేక ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తున్నాం. 200 దే‌శాల్లో ఒకేసారి మా సినిమాని వీక్షిస్తారు అన్న‌ది ఆనందంగానే ఉన్నా థియేట్రిక‌ల్ ఎక్స్ పీరియెన్స్ లేక‌పోవ‌డ‌మే బాధాక‌రం. థియేట‌ర్ లో సినిమా చూడ‌డ‌మే ఇష్టం. అంద‌రూ దానిని ఎక్కువ‌గా ఎంజాయ్ చేస్తారు.. అని అన్నారు.