Begin typing your search above and press return to search.
రజనీకి ఇప్పుడెలా ఉంది..మోహన్ బాబు ఆరా
By: Tupaki Desk | 26 Dec 2020 9:30 AM ISTతమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ తన తాజా సినిమా అన్నాత్తే షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ వచ్చి హైబీపీతో తీవ్ర అస్వస్థతకు గురై జూబ్లీహిల్ల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. రజనీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చికిత్స అందిస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్ వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం రజనీ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. కాగా రజనీ ఆరోగ్యం ఎలా వుంది.. అని ఆయన ప్రాణ స్నేహితుడు, ప్రముఖ నటుడు మోహన్ బాబు ఆరా తీశారు.
ప్రస్తుతం ఆయన తిరుపతిలో ఉన్నారు. మోహన్ బాబుకు అక్కడ విద్యా సంస్థలు ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ పనులు చూసుకునేందుకు అప్పుడప్పుడు ఆయన తిరుపతి వెళ్లి వస్తుంటారు. రజనీ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుసుకున్న మోహన్ బాబు వెంటనే ఆయన ఆరోగ్యం ఎలా వుంది ..అని హైదరాబాద్ లోని ఆస్పత్రిలో ఉన్న రజనీ సతీమణి లత, ఆయన కుమార్తె ఐశ్వర్య, సోదరికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏమీ లేదని వారు చెప్పడంతో మోహన్ బాబు కాస్త కుదుటపడ్డారు. రజనీ కాంత్ మానసికంగా, శారీరకంగా ఎంతో దృఢమైన వ్యక్తి అని, అస్వస్థత నుంచి త్వరగా కోలుకుని తిరిగి తన దైనందిన కార్యక్రమాలు ప్రారంభిస్తారని ఈ సందర్బంగా మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
రజనీ-మోహన్ బాబుల అనుబంధం ఈనాటిది కాదు. ఎన్నో ఏళ్ళుగా వారు సన్నిహితులుగా మెలుగుతున్నారు. ఒకరు టాలీవుడ్ లో, మరొకరు కోలీవుడ్లో అగ్ర హీరోలుగా ఎదిగినా తమ స్నేహాన్ని మాత్రం కొనసాగిస్తూ ఉన్నారు. రజనీ షూటింగ్ నిమిత్తం ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మోహన్ బాబును కచ్చితంగా కలసే వెళతారు. పెదరాయుడు సినిమాలో తన స్నేహితుడి కోసం రజనీ ప్రత్యేక పాత్రలో నటించారు. ఆ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే.