Begin typing your search above and press return to search.
550 చిత్రాల నటుడికి వింత పరిస్థితి
By: Tupaki Desk | 9 March 2019 7:00 AM ISTటాలీవుడ్ లో హీరోగా - విలన్ గా - క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యభరిత చిత్రాల్లో నటించిన మోహన్ బాబు మొత్తంగా 550 చిత్రాలకు పైగా నటించాడు. ఇండస్ట్రీకి ఇద్దరు హీరోలను ఇవ్వడంతో పాటు మంచు లక్ష్మి వంటి నటిని కూడా ఇచ్చాడు. ఇంతటి సీనియర్ నటుడు అయిన మోహన్ బాబును ప్రస్తుతం టాలీవుడ్ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం హీరోగా నటించే పరిస్థితి లేదు - క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయాలని ఆసక్తి ఉన్నా కూడా ఏ హీరో కూడా తన సినిమాలో మోహన్ బాబు పేరును ప్రపోజ్ చేయడం లేదు. చిన్నా చితకా దర్శకులు మోహన్ బాబు వద్దకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.
మోహన్ బాబు పెద్ద సినిమాల్లో ఛాన్స్ లు లేక - చిన్న సినిమాల్లో నటించే పరిస్థితి రాక వింత అనుభవంను ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయనకు తమిళ స్టార్ హీరో సూర్య నుండి ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలుగు దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో సూర్య ఒక ద్వి భాష చిత్రాన్ని చేయబోతున్న విషయం తెల్సిందే. కొన్ని కారణాల వల్ల వీరి కాంబో మూవీ ఆలస్యం అవుతున్నా ఈ ఏడాది ద్వితీయార్థంలో మూవీ ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ చిత్రంలో మోహన్ బాబును కీలక పాత్రకోసం సంప్రదించారట. సూర్య కూడా మోహన్ బాబుతో నటించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.
తెలుగులో ఛాన్స్ లు లేకపోవడంతో తమిళ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పిన మోహన్ బాబు తమిళంలో అయినా బిజీ అవుతాడేమో చూడాలి. సుధ కొంగర సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే వరకు కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఆమెతో సూర్య వర్క్ చేసేందుకు ఆసక్తిగా ఉన్న మాట వాస్తవమే కాని, వెంటనే ఆమె సినిమా చేయాలన్నంత ఆసక్తిగా అయితే లేడనిపిస్తుంది. ప్రస్తుతం చేస్తున్న ఎన్జీకే మరియు కాప్పన్ చిత్రాలు పూర్తి అయిన తర్వాత సుధ కొంగర సినిమా చేస్తానన్నాడు. అయితే ఈలోపు మరేదైనా మంచి ప్రాజెక్ట్ వస్తే సుధ కొంగర మూవీని మరింత ఆలస్యం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దాంతో మోహన్ బాబు తమిళ మూవీ అవకాశం కూడా నమ్మకంగా అనిపించడం లేదు. మోహన్ బాబు వంటి స్టార్ నటుడికి ఇలాంటి వింత పరిస్థితి ఎదురవ్వడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా..!