Begin typing your search above and press return to search.

మెగా - మంచు హీరోల మీటింగ్స్ వెనుక ఆంతర్యం అదేనా..?

By:  Tupaki Desk   |   24 Dec 2020 11:00 AM IST
మెగా - మంచు హీరోల మీటింగ్స్ వెనుక ఆంతర్యం అదేనా..?
X
మెగా - మంచు హీరోల మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంటుందనే విషయం తెలిసిందే. ఇంతకముందు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం చిరు - మోహన్ బాబులు అన్నదమ్ముల్లా స్నేహితుల్లా మెలుగుతున్నారు. వీరి మధ్య అనుబంధం గురించి పలు వేదికలపై చెప్పుకుంటూ వచ్చారు. అయితే తాజాగా తండ్రీకొడుకులు మంచు మోహన్ బాబు - విష్ణు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు మెగాస్టార్ ని కలవడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇటీవల మంచు విష్ణు చిరంజీవిని కలుసుకున్నట్లుగా తెలుపుతూ ఓ ఫొటోని సోషల్‌ మీడియా మాధ్యమాల్లో షేర్‌ చేశాడు. బిగ్ బాస్ ను ఎందుకు కలిసానో చెప్తానని పోస్ట్ చేశాడు. దీంతో వీరేందుకు మీట్ అయ్యారో అనే ఆతృత సినీ అభిమానుల్లో మొదలైంది. ఇదిలా ఉంటే నిన్న సడన్ గా కలెక్షన్ కింగ్ 'ఆచార్య' సెట్ లో ప్రత్యక్షమై సర్ప్రైజ్ ఇచ్చాడు.

చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న 'ఆచార్య' సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌ లో జ‌రుగుతోంది. బుధ‌వారం మోహ‌న్‌ బాబు 'ఆచార్య' లొకేషన్ కి వెళ్లి చిరంజీవికి బొకే ఇచ్చి, స్నేహ‌పూర్వ‌కంగా మాట్లాడారు. చిర‌కాల మిత్రులు ఇద్దరు కొద్దిసేపు సినిమాల‌తో పాటు వివిధ అంశాల‌పై మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. ఇలా మంచు హీరోలు ఒకరి తర్వాత ఒకరు చిరుతో సమావేశం కావడంతో ఏదో విషయమే ఉందని స్పష్టమవుతూనే ఉంది. మోహ‌న్‌ బాబు ప్ర‌స్తుతం నటిస్తున్న 'స‌న్ ఆఫ్ ఇండియా' మూవీలో ఏదైనా స్పెషల్ రోల్ చేయమని అడగడానికి వెల్లారేమో అనే టాక్ నడుస్తోంది. అలానే చిరంజీవి నటిస్తున్న 'లూసిఫర్' తెలుగు రీమేక్ లో పృథ్వీరాజ్ పోషించిన పాత్రలో మంచు విష్ణు ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయేమో అని కూడా అంటున్నారు. మొతం మీద మెగా - మంచు హీరోలు కలిసి ఏదో భారీగానే ప్లాన్‌ చేస్తున్నట్లుగా టాలీవుడ్‌ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మరి మ్యాటర్ ఏంటనేది త్వరలోనే మంచు విష్ణు క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.