Begin typing your search above and press return to search.
'ఆచార్య'లో మంచు హీరో విలనా.. కమెడియనా...?
By: Tupaki Desk | 17 April 2020 2:47 PM ISTచిరంజీవి - మోహన్ బాబు.. ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోల్లో వీరిద్దరిదే ప్రత్యేకమైన అనుబంధమని చెప్పొచ్చు. ఇద్దరూ మిత్రులో.. శత్రువులో అర్థంకాని అయోమయం క్రియేట్ చేస్తారు. ఆన్ స్క్రీన్ లో ఎన్నో సినిమాల్లో నటించినా.. ఆఫ్ స్క్రీన్ లో ఇద్దరి మధ్య దశాబ్దాలుగా ఇలాంటి అనుబంధమే కొనసాగుతోంది. అప్పుడే ఇద్దరూ పబ్లిక్ లో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటారు. అంతలోనే మళ్ళీ ఇద్దరూ ఒకటే అనే రేంజిలో కౌగిలించేసుకుంటారు. వారిద్దరి మధ్య పేరులేని అనుబంధం ప్రేక్షకులకు కూడా సరదాగానే అనిపించేలా నడుస్తోంది. చిరంజీవి - మోహన్ బాబులు ఎన్నో సినిమాల్లో హీరోగా - విలన్ గా కలిసి నటించారు. కిరాయి రౌడీలు - పట్నం వచ్చిన పతివ్రతలు - బిల్లా రంగా - చక్రవర్తి - మంచి దొంగ - యుద్ధభూమి - లంకేశ్వరుడు - కొండవీటి దొంగ సినిమాల్లో కలిసి నటించారు. వీరిద్దరూ చివరగా ‘కొదమ సింహం’ సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడవడంతో వారి కాంబోలో మరో సినిమా రాలేదు.
అయితే మోహన్ బాబు - చరంజీవి ఇటీవలే తమ మధ్య ఉన్న కోల్డ్ వార్ కి స్వస్థి పలికేశారు. ఇద్దరకిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు. ఈ నేపథ్యంలో చిరంజీవి నెక్స్ట్ సినిమాలో మోహన్ బాబు కీలక పాత్ర చేస్తున్నట్లుగా వార్తలు కూడా షికారు చేసాయి. అయితే ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. దీంతో చిరుతో మోహన్ బాబు మళ్లీ కలిసి నటిస్తున్నాడా లేదా.. అనే క్లారిటీ లేకుండాపోయింది. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ కామెడీ విలన్ రోల్ ఉందట.. ఆ క్యారెక్టర్ ని మోహన్ బాబుని చేయమని అడగుతున్నాడట చిరంజీవి.
అయితే కామెడీ రోల్ కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ ఏదైనా ఉంటే చేస్తానంటూ మోహన్ బాబు నుంచి సమాధానం వచ్చిందట. దీంతో మోహన్ బాబుకి నెగటివ్ షేడ్స్ రోల్ ఉండేలా చూడమని చిరు కొరటాలని అడిగాడట. దీనికి తగ్గట్టుగా కొరటాల మళ్లీ కథలో మార్పులు చేస్తున్నాడట. ఈ విషయమై చిరంజీవి నుంచి కూడా ప్రెజర్ వస్తుండటంతో కొరటాల కాస్త ఇబ్బంది పడుతూనే మరోసారి 'ఆచార్య' స్క్రిప్ట్ ని మారుస్తున్నట్లుగా సమాచారం. ఏదేమైనా ఇన్నేళ్ల తర్వాత ఈ చిరకాల శత్రువులు.. సారీ.. చిరకాల మిత్రులు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.