Begin typing your search above and press return to search.
ఆహా 'ఆండ్రాయిడ్ కట్టప్ప'లో మోహన్ బాబు
By: Tupaki Desk | 19 Oct 2020 5:45 AM GMTఈ మద్య ఆహా లో ప్రతి శుక్రవారం ఒకటి చొప్పున మలయాళ సినిమాలు డబ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. రెండు వారాల క్రితం ఆహా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఆండ్రాయిడ్ కట్టప్ప. తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిన ఆ సినిమా మోహన్ బాబును కూడా మెప్పించినట్లుగా ఉంది. ఇప్పటికే ఆహా ద్వారా డబ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాను రీమేక్ చేయాలని కోరుకుంటున్నాడు. ఇటీవల స్వయంగా స్వీయ నిర్మాణంలో నిర్మించేందుకు గాను ఆ సినిమా రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగింది.
ఒక వృద్దుడు తన కొడుకు విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉంటాడు. ఆ సమయంలో అతడు ఇబ్బందులు పడుతూ ఉంటాడు. దాంతో తండ్రి ఒంటరితనంను పోగొట్టేందుకు ఆయనకు సేవలు చేసేందుకు కొడుకు ఒక రోబోను తండ్రి వద్ద ఉంచుతాడు. మెషన్లు అంటే అస్సలు ఇష్టం లేని ఆ తండ్రి కొన్నాళ్లు రోబోట్ ను దూరం పెడతాడు. మెల్ల మెల్లగా ఆ రోబోల్ చేస్తున్న పనులతో మనసుకు దగ్గర చేసుకుంటాడు. ఆ రోబోట్‌కు డ్రస్ కుట్టించడం, జాతకం చూపించడం వంటివి చేస్తూ ఉంటాడు. అలా రోబోట్ ను పూర్తిగా తన కొడుకుగా అనుకుంటాడు. అయితే ఆ రోబోట్ పైలెట్ ప్రాజెక్ట్ గా మాత్రమే అతడి వద్ద ఉంటుంది.
కొన్నాళ్ల తర్వాత దాన్ని తిరిగి తీసుకు వెళ్లాలని భావిస్తే అందుకు నో చెప్పి అడవి లోకి పారిపోతాడు. రోబోట్ తో అడవి లోకి పారిపోయిన ఆ వృద్దుడు ఆ తర్వాత ఏం చేశాడు.. చివరకు ఏం జరిగింది అనేది కథ. ఈ కథలో వృద్దుడి పాత్రలో మోహన్ బాబు నటిస్తాడట. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమాకు కమర్షియల్ టచ్ ఇచ్చి ఒక దర్శకుడు స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టాడట. త్వరలోనే అధికారికంగా రీమేక్ ను ప్రకటించే అవకాశం ఉంది. రెండేళ్ల తర్వాత మోహన్ బాబు ఆకాశమే నీ హద్దురా సినిమాతో రాబోతున్నాడు. మళ్లీ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చర్చలు జరుపుతున్నాడు.