Begin typing your search above and press return to search.
సక్సెస్ గర్వం తెస్తుంది .. ఫ్లాప్ పాఠం చెబుతుంది: మోహన్ బాబు
By: Tupaki Desk | 5 Oct 2021 8:00 PM ISTమోహన్ బాబు .. విలక్షణమైన నటనకు కేరాఫ్ అడ్రెస్. పట్టుదలకీ .. కార్యదీక్షకి ఆ పేరు ప్రత్యామ్నాయం. డైలాగ్ చెప్పడంలో ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది. నడకలో ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. పవర్ఫుల్ విలన్ గా .. కామెడీ విలన్ గా .. కేరక్టర్ ఆర్టిస్ట్ గా .. హీరోగా ఆయన చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీకాదు. తెలుగు ప్రేక్షకులతో 'అల్లుడు గారు' అనిపించుకోవడం .. 'పెదరాయుడు' అని పిలిపించుకోవడం ఆయనకే చెల్లింది. అలాంటి మోహన్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
"నేను మంచి వయసులో ఉన్నప్పుడు .. ఆర్టిస్టుగా బిజీగా ఉన్నప్పుడు సరిలేరు నా కెవ్వరు అనుకునేవాడిని. ఒక సక్సెస్ వస్తే కన్నూ మిన్నూ తెలిసేది కాదు. తరువాత సినిమా అంతకంటే పెద్ద హిట్ అవుతుందని గొప్పగా చెప్పేవాడిని. కానీ ఆ సినిమా సూపర్ ఫ్లాప్ అయింది. ఒక్క ఫ్లాప్ పడితేగాని తెలియలేదు .. ఇంటికి వచ్చే కార్లన్నీ మాయమైపోతాయని. జీవితంలో చాలా ఎదురుదెబ్బలు తగిలాయి .. తగులుతూనే ఉన్నాయి. ఒకప్పుడు 'బిందాస్' గా ఉన్న మోహన్ బాబును అవి కుంగదీస్తున్నాయి. నా సినిమా జీవితాన్ని దెబ్బకొట్టడం ఆ పై వాడివల్లనే అవుతుంది .. ఇంకెవ్వరి వలన కాదు. వ్యాపార పరమైన విషయాల్లోనే నమ్మినవాళ్లు మోసం చేశారు.
సినిమా పరిశ్రమ చాలా భయాందోళనలను కలిగించే పరిస్థితుల్లో ఉంది. కళామతల్లి నాకు ఏ లోటూ చేయలేదు .. పిల్లలు సినిమాలోకి వచ్చాక, ఏడాదికి ఒకటి రెండు సినిమాలు సరదాగా చేసుకోవాలనే ఉద్దేశంతో నాకు నేనుగా తప్పుకున్నాను. కరోనా వచ్చిన తరువాత సినిమా పరిశ్రమ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. థియేటర్లో సినిమాలు చూస్తూ ఆడియన్స్ చప్పట్లు కొడుతుంటే చూసినవాళ్లం. ఇప్పుడు అంతా ఓటీటీ అంటున్నారు. ఫోన్లలో ఎవరు చూస్తున్నారో .. ఎలా ఫీలవుతున్నారో ఎవరికీ తెలియదు. ఫాస్ట్ ఫార్వార్డ్ చేసిమరీ చూసుకుంటున్నారు. ఒకప్పుడు గోల్డెన్ పీరియడ్ చూసినవాడిని నేను .. ఆ రోజులు మళ్లీ రావు.
నేను ఏ ఒక్కరినీ ఉద్దేశించి అంటున్నానని అనుకోవద్దు. ఒకసారి మా గురువుగారు దాసరి నారాయణరావు గారు మాట్లాడుతూ, "మోహన్ ఇప్పుడు నిర్మాతలు ఎవరున్నారు? 98 శాతం నిర్మాతలనేవారు లేరు. ఇప్పుడు వాళ్లంతా హీరోల చేతిలో బ్రోకర్లయి పోయారు" అన్నారు. ఆయనన్న మాటల్లో నిజం ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వెళ్లేంతవరకూ సినిమాల పరిస్థితి బాగుంటుంది. కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఆ రోజులు మళ్లీ రావాలని కోరుకుందాం. వెబ్ సిరీస్ ల వలన కొత్తవాళ్లకి అవకాశాలు రావచ్చు .. కానీ వాళ్లు నాకంటే బాగా చేస్తారంటే మాత్రం ఒప్పుకోను. దానిని పొగరంటారా? అహంకారమంటారా? ఆత్మవిశ్వాసమంటారా? మీరు ఏమైనా అనుకోండి.
ఏ పాత్రనైనా అవలీలగా చేయగలను .. ఏ డైలాగ్ నైనా అద్భుతంగా చెప్పగలను. అన్నగారితోనే పోటీపడి నటించినవాడిని నేను. ఇప్పుడు కూడా నేను హీరోగా వేయాలని .. డ్యూయెట్లు పాడాలని అనుకోవడం లేదు. 'ఆకాశం నీ హద్దురా' సినిమాలో ఒక ముఖ్యమైన రోల్ చేశాను .. మంచిపేరు వచ్చింది. 'శాకుంతలం'లో దుర్వాస మహాముని వేషం వేశాను. మంచి పాత్ర .. అందుకు తగిన పారితోషికం ఉండాలి. పాత్ర బాగుండి పారితోషికం తక్కువ ఇస్తానన్నా ఒప్పుకోను. పారితోషికం ఎక్కువ ఇచ్చినా పాత్ర బాగోలేకపోతే ఒప్పుకోను. రెండూ బాగుండాలి .. అప్పుడు మాత్రమే చేస్తాను" అని చెప్పుకొచ్చారు.