Begin typing your search above and press return to search.

ఫసక్‌ ట్రోలింగ్‌ - మీమ్స్‌ పై మోహన్‌ బాబు స్పందన

By:  Tupaki Desk   |   3 Sep 2018 4:54 PM GMT
ఫసక్‌ ట్రోలింగ్‌ - మీమ్స్‌ పై మోహన్‌ బాబు స్పందన
X
కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు డైలాగ్స్‌ చెప్పడంలో కూడా కింగ్‌ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాని ఈమద్య ఈయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన డైలాగ్‌ లో వచ్చిన ఫసక్‌ పదం పెద్ద ఎత్తున ట్రెండ్డింగ్‌ అవుతోంది. మోహన్‌ బాబు కొత్త పదంను కనిపెట్టాడు అంటూ వేలాది ట్వీట్స్‌ ‘ఫసక్‌’ పదంపై నమోదు అయ్యాయి. సోషల్‌ మీడియాలో ఏకంగా ట్రెండ్‌ అయిన ఈ పదం అర్థం ఏంటా అని కొందరు గూగుల్‌ కూడా చేస్తున్నారు. మోహన్‌ బాబు తన కూతురు మంచు లక్ష్మితో ఇండియా టుడేకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఈ పదం దొర్లింది.

ఇంటర్వ్యూలో భాగంగా తాను నటించిన సూపర్‌ హిట్‌ మూవీ ‘ఎం ధర్మరాజు ఎంఏ’ చిత్రంలోని ఒక డైలాగ్‌ ను తనదైన శైలిలో చాలా పవర్‌ ఫుల్‌ గా - ఇంగ్లీష్‌ లో చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలోనే వచ్చింది ఈ పదం. మోహన్‌ బాబు నోటి నుండి ఎప్పుడైతే ఆ పదం వచ్చిందో అప్పటి నుండి సోషల్‌ మీడియాలో రకరకాల మీమ్స్‌ - ఫన్నీ వీడియోలు ఇంకా ఎన్నో ఎన్నెన్లో వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. సోషల్‌ మీడియాలో సెన్షేషన్‌ అయిన ఈ ‘ఫసక్‌’ పదంపై మోహన్‌ బాబు తాజాగా తన ట్విట్టర్‌ ద్వారా స్పందించాడు.

తనపై వస్తున్న ట్రోలింగ్‌ కు ఆగ్రహం వ్యక్తం చేయకుండా కూల్‌ గానే సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్యపర్చాడు. ఫసక్‌ అనే పదం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవ్వడం మంచిగా అనిపించింది. ఫసక్‌ పదంపై దాదాపు 200 ఫన్నీ వీడియోలు వచ్చినట్లుగా విష్ణు చెప్పాడు. అందులో కొన్ని చూశాను. చాలా ఫన్నీగా ఉన్నాయి అంటూ పోస్ట్‌ చేశాడు. ఫసక్‌ ట్రోలింగ్‌ ను కాస్తయినా తగ్గించుకునేందుకు మోహన్‌ బాబు ఇలా పోస్ట్‌ చేసి ఉంటాడు అంటూ టాక్‌ వినిపిస్తుంది. మోహన్‌ బాబు ఫన్నీగా తీసుకున్న కారణంగా ట్రోలింగ్‌ తగ్గే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఇప్పటికైనా మోహన్‌ బాబు ఫసక్‌ పదంపై ట్రోల్స్‌ ఆగుతాయో చూడాలి.