Begin typing your search above and press return to search.
పెదరాయుడుకు 25 ఏళ్లు.. మోహన్ బాబు తీపిగుర్తులు
By: Tupaki Desk | 15 Jun 2020 10:30 AM ISTమోహన్ బాబు, రజినీకాంత్ కలిసి నటించిన పెదరాయుడు తెలుగులోనే బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటి. అది విడుదలై నేటికి 25 ఏళ్లు(1995 జూన్ 15) అవుతోంది. ఈ సందర్భంగా నాడు హీరోగా నటించడమే కాదు.. తన సొంత బ్యానర్ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించిన మోహన్ బాబు తాజాగా తన అనుభూతులు పంచుకున్నారు.
తమిళంలో హిట్ అయిన ‘నాట్టామై’ రిమేక్ హక్కులను రజినీకాంత్ తన స్నేహితుడైన మోహన్ బాబుకు పిలిచి మరీ ఇప్పించాడట.. సినిమా చూసి రిమేక్ హక్కులు కావాలంటే చెప్పమని రజినీ చెన్నైకి మోహన్ బాబును పిలిపించాడట..అంతేకాదు నిర్మాత ఆర్బీ చౌదరిగారితో మాట్లాడి మరీ రజినీకాంత్ ఈ రిమేక్ హక్కులను మోహన్ బాబు చేతిలో పెట్టించాడట.. అంతేకాదు ఏకంగా అప్పటికే రెండు ఫ్లాపులతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మోహన్ బాబుకు రూ.45 లక్షల పెట్టుబడి సమకూర్చి మరీ ‘పెదరాయుడు’ హిట్ అయ్యాక ఇవ్వు అని ప్రోత్సహించాడట.. ఈ విషయాలన్నీ మోహన్ బాబు ‘పెదరాయుడు’ సినిమా 25 ఏళ్లు అయిన సందర్భంగా పంచుకున్నాడు.
ఈ సినిమాలో భానుప్రియ, సౌందర్య, బ్రాహ్మనందం, బాబు మోహన్ అన్ని పాత్రలు కుదిరినా.. ఒక్క పాపారాయుడు పాత్రకు ఎవరూ దొరకకపోతే.. స్వయంగా రజినీకాంతే నటిస్తానని ముందుకు రావడం విశేషం. ఆ పాత్ర చేయాలనుకునే నేను నీకు ఈ సినిమా ఇప్పించానని రజినీ అన్నాడట..
పెదరాయుడు చిత్రానికి అన్న ఎన్టీఆర్ క్లాప్ కొట్టాడు. తొలిషాట్ లో తండ్రి అయిన రజినీకాంత్ కి మోహన్బ ాబు పూలమాల వేయబోతుండగా దాన్ని అందుకొని మోహన్ బాబుకు వేసి కాళ్లకు దండం పెట్టాడట రజినీకాంత్.. నీ మంచి మనసుకు ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అన్నాడట..
ఇక పెదరాయుడు సినిమా 25 ఏళ్లు అయిన సందర్భంగా ఘనంగా వేడుక చేద్దామని అనుకున్నానని.. కానీ కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందని మోహన్ బాబు అన్నారు. నాటి సినిమాకు క్లాప్ కొట్టిన ఎన్టీఆర్, నటించిన సౌందర్య, నాటి కెమెరామెన్ కేఎస్ ప్రకాష్ రావులు ఇప్పుడు లేరని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు.
ఓ అందమైన కుటుంబ కథ తయారు చేశామని.. పెదరాయుడులా తీస్తామని మోహన్ బాబు అన్నారు. పెదరాయుడు లాంటి అద్భుత చిత్రానికి రిమేక్ తీయడం కష్టమని.. భవిష్యత్తులో మనోజ్, విష్ణు తీస్తారేమో అని తెలిపాడు.
కరోనా మనిషికి గుణపాఠం అని.. ప్రపంచాన్ని నాశనం చేస్తున్న మనిషి అహం, బుద్దిరావాలనే దేవుడు సృష్టించాడని మోహన్ బాబు అన్నారు.