Begin typing your search above and press return to search.
మెగా152 పుకార్లకు ఫుల్ స్టాప్
By: Tupaki Desk | 13 Feb 2020 2:45 PM ISTమెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంపై వస్తున్నని వార్తలు ఈమద్య కాలంలో ఏ సినిమాలకు కూడా రావడం లేదు. హీరోయిన్ విషయం.. కథ విషయం.. రామ్ చరణ్ గెస్ట్ అప్పియరెన్స్.. ఐటెం సాంగ్.. విజయశాంతి అంటూ.. మోహన్ బాబు అంటూ వార్తలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. చిరంజీవి 152వ చిత్రంకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో చిన్న వార్త కూడా చాలా ప్రముఖంగా ప్రచారం జరుగుతుంది. మోహన్ బాబు మెగా 152లో నటించబోతున్నాడు అంటూ వచ్చిన వార్త ఏ స్థాయిలో ట్రెండ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మోహన్ బాబు ఈ లుక్ లో చిరు 152 చిత్రంలో నటించబోతున్నాడు అంటూ ఒక ఫొటో కూడా వైరల్ అయ్యింది. ఈ విషయమై రెండు వారాలుగా వస్తున్న వార్తలకు చిత్ర యూనిట్ సభ్యులు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇంకా ఆలస్యం చేస్తే బాగోదనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ సభ్యుల నుండి క్లారిటీ వచ్చింది. మోహన్ బాబు తమ సినిమాలో నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని చెప్పుకొచ్చారు. మోహన్ బాబు గారిని అసలు ఈ చిత్రం కోసం సంప్రదించలేదు.. ఆయనకు తగ్గ పాత్ర మా సినిమాలో లేదంటూ క్లారిటీ ఇచ్చారు.
మోహన్ బాబు గతంలో వరుసగా చిత్రాలు చేసినా ఈమద్య కాలంలో కాస్త స్లో అయ్యాడు. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో చిరంజీవి సినిమాలో ఈయన నటించబోతున్నాడు అనగానే అంతా చాలా సంతోషించారు. వీరిద్దరి కాంబో గతంలో చాలా ఫేమస్. ఇప్పుడు మళ్లీ వారిని ఒకే స్క్రీన్ పై చూడబోతున్నందుకు చాలా ఆనందించారు.
కాని వారి ఆనందం మూడు నాళ్ల ముచ్చటే అయ్యింది. మోహన్‌బాబు ప్రస్తుతానికి చిరంజీవి సినిమాలో నటించడం లేదు. వీరిద్దరి మద్య గతంలో విభేదాలు ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అదేమి లేదు మీమిద్దరం మంచి స్నేహితులం అంటూ ఇటీవల పలు వేదికల మీద ఆలింగనం చేసుకుని మరీ నిరూపించారు. కనుక ఇద్దరు కలిసి నటించడం నిజమే అనుకున్నారు. కాని అవి కేవలం పుకార్లే అని తేలిపోయింది.