Begin typing your search above and press return to search.

20 రూపాయ‌లు రెంటు క‌ట్ట‌లేక‌పోయాను

By:  Tupaki Desk   |   22 Nov 2015 3:33 PM IST
20 రూపాయ‌లు రెంటు క‌ట్ట‌లేక‌పోయాను
X
స్వ‌ర్గం న‌ర‌కం చిత్రం ద్వారా న‌టుడుగా ప‌రిచ‌య‌మైన మోహ‌న్ బాబు న‌టుడుగా స‌రిగ్గా ఈ నాటికి 40 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ రోజు న‌ల‌భై వ‌సంతాల వేడుకల‌ను పార్క్ హ‌య‌త్ లో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ...నా తొలి నాళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. వాటిలో చాలా మీతో గతంలో షేర్ చేసుకున్నా కానీ చేసుకోలేనివి చాలా ఉన్నాయి. ఈరోజు అవ‌న్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. అంటూ క‌ళ్లు చెమ‌ర్చారు మోహ‌న్ బాబు. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ... ఆ రోజు నేను ఉండే రూము రెంటు ఇర‌వై రూపాయ‌లు. అవి కూడా క‌ట్టే స్థోమ‌త ఆ నాడు నాకు లేదు.

రెంటు డ‌బ్బులు కోసం ఇంటి ఓన‌రు రోజూ పీక్కుతినేవాడు. ఓ రోజు నేను లేని స‌మ‌యంలో నా రూములో కొచ్చి నేను వంట వండుకునే పాత్ర‌ల్లో చేయ‌కూడ‌ని ప‌ని చేసి పోయాడు ఇంటి ఓనరు. నేను ఇంటికొచ్చి వంట వండుకొందామ‌ని చూస్తే పాత్ర‌లు ఒక‌టే కంపు కొడుతున్నాయి. కానీ అప్పుడు ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. ఆ రాత్రంతా ప‌స్తులే ప‌డుకున్నా. మ‌రునాడు ఆ పాత్ర‌ల‌ని క్లీన్ చేసి వంట వండుకొని తిన్నాను అంటూ ఆ రోజుల్లో త‌ను ప‌డ్డ క‌ష్టాల‌ను, ఎదుర్కొన్న ఛీత్కారాల‌ను నెమ‌రువేసుకున్నారు మోహ‌న్‌ బాబు.