Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : బాలయ్య 'ఆహా' షో ఫస్ట్‌ గెస్ట్‌ ఈయనే

By:  Tupaki Desk   |   26 Oct 2021 5:49 AM GMT
ఫొటోటాక్ : బాలయ్య ఆహా షో ఫస్ట్‌ గెస్ట్‌ ఈయనే
X
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ గా ఆహాలో దీపావళి నుండి స్ట్రీమింగ్ కాబోతున్న అన్ స్టాపబుల్ టాక్ షో లో మొదటి గెస్ట్‌ ఎవరు అనే విషయమై క్లారిటీ వచ్చేసింది. గతంలోనే మనం చర్చించినట్లుగా బాలయ్య షో మొదటి గెస్ట్‌ గా మంచు హీరో మోహన్ బాబు హాజరు అవ్వబోతున్నాడు. ఇటీవలే అందుకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తి అయ్యింది. ఆహా అన్‌ స్టాపబుల్‌ సెట్‌ లో బాలయ్యతో కలిసి మోహన్‌ బాబు ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. ఆ ఫొటోలు లీక్ అయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో టీజర్ మరియు మోహన్‌ బాబు ఎపిసోడ్‌ కు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేస్తారనే సమాచారం అందుతోంది.

బాలకృష్ణ మరియు మోహన్‌ బాబులు ఇద్దరు ఇద్దరే. ఇలాంటి టాక్ షోల్లో ఇద్దరు కనిపించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అలాంటిది బాలయ్య హోస్ట్‌ గా మోహన్‌ బాబు గెస్ట్ గా మొదటి ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అవ్వడం అందరికి చాలా ఉత్కంఠభరితంగా ఉంది. వీరిద్దరి కాంబో ఎలా ఉంటుందా అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో టాక్ షో లను చూడటం జరిగింది. ఎన్నో సెలబ్రెటీల ఇంటర్వ్యూలను చూశాం. కాని బాలయ్య టాక్ షో అనగానే ఒక రకమైనా ఆసక్తి.. ఒక రకమైన ఆతృత జనాల్లో కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్‌ చేస్తామా అంటూ అభిమానులతో పాటు అంతా కూడా ఆసక్తిగా ఉన్నారు.

మోహన్‌ బాబు ఏదైనా ఇంటర్వ్యూలో హాజరు అయ్యాడు అంటే ఖచ్చితంగా ఆ ఇంటర్వ్యూలో ఏదో ఒక విషయమై సంచలనం ఉంటుంది. హోస్ట్‌ ను దబాయించడం లేదంటే మరో రకంగా ఆ ఇంటర్వ్యూ వైరల్‌ అవుతూ ఉంటుంది. ఇక బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సాదారణంగా మాట్లాడితేనే బెదిరించినట్లుగా ఉంటుంది. ఆయన భయపెట్టే విధానం కూడా అందరికి ముచ్చటేసే విధంగా ఉంటుంది. అందుకే వీరిద్దరి కాంబో టాక్ షో ఎలా ఉంటుందో ఊహకు కూడా అందడం లేదు. ఇద్దరు టాలీవుడ్‌ బిగ్ స్టార్స్ అవ్వడం వల్ల ఖచ్చితంగా ఆహా అన్నట్లుగా ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారని విశ్లేషకులు అంటున్నారు. అన్ స్టాపబుల్‌ టాక్ షో ను బాలయ్య ఛారిటీ కోసం చేస్తున్నాడట. దీని ద్వారా వచ్చే మొత్తం పారితోషికంను కూడా ఛారిటీకి ఉపయోగిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక బాలయ్య అఖండ సినిమా తో రెడీ అవుతుండగా.. మోహన్‌ బాబు సన్నాఫ్‌ ఇండియా సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.