Begin typing your search above and press return to search.

గాయత్రి వచ్చేది ఎప్పుడంటే..

By:  Tupaki Desk   |   14 Dec 2017 11:49 AM IST
గాయత్రి వచ్చేది ఎప్పుడంటే..
X
ఒకప్పుడు టాలీవుడ్ కలెక్షన్ కింగ్ గా కొనసాగిన మోహన్ బాబు ఆ తర్వాత స్పెషల్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుంచి అయన కేవలం తనకు నచ్చిన పాత్రలనే చేస్తున్నారు. ఇక రెండేళ్ల క్రితం సినిమాలను చేయడం లేదని మోహన్ బాబు చెప్పినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్ గా అయన రెండేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం గాయత్రి అనే సినిమాను చేస్తున్నాడు.

రాజకీయ నేపథ్యంలో సాగనున్న ఈ కథను మదన్ డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమాలో మంచి కథాంశం ఉండడంతో మోహన్ బాబు ఎంతో ఇష్టంగా సినిమాను ఒప్పుకున్నారట. సినిమా మొదలుపెట్టినప్పటి నుండి ఎక్కువగా గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొన్నారు. దాదాపు సినిమా షూటింగ్ ఎండింగ్ కి వచ్చేసింది. ఇక అసలు విషయానికి వస్తే సినిమా రిలీజ్ డేట్ పై గత కొన్ని రోజులుగా వస్తోన్న రూమర్స్ కి చిత్ర యూనిట్ చెక్ పెట్టింది.

సినిమాను ఫైనల్ గా ఫిబ్రవరి 9న రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషయల్ ఎనౌన్సమెంట్ ఇచ్చేశారు. ఇక సినిమాలో మోహన్ బాబు యువకుడిగా ఉన్నప్పటి పాత్రను మంచు విష్ణు చేయబోతున్నాడు. శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది. నిఖిలా విమలా టైటిల్ రోల్ క్యారెక్టర్ లో అలరించనుంది. బ్రహ్మానందం - అనసూయ భరద్వాజ్ వంటి నటి నటులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.