Begin typing your search above and press return to search.

ఒంటి మీదున్న జ‌త బ‌ట్ట‌ల‌తోనే బ‌స్సెక్కేస్తే..

By:  Tupaki Desk   |   22 Nov 2015 5:00 PM IST
ఒంటి మీదున్న జ‌త బ‌ట్ట‌ల‌తోనే బ‌స్సెక్కేస్తే..
X
భ‌క్త‌వ‌త్స‌లం మోహ‌న్‌ బాబు ఎలా అయ్యాడు? అస‌లు మోహ‌న్‌ బాబు ప్రారంభ జీవితం ఏంటి? ఈరోజు ఇంత‌గా ఇంతింతై వ‌టుడింతై ఎలా అయ్యాడు? ఇలాంటి సందేహాలెన్నో ఎప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కుల్ని వేధించేవే. భ‌క్త‌వ‌త్స‌లం మోహన్‌బాబుగా మార‌డం వెనక, ఇంత పెద్ద ఆస్తిప‌రుడిగా, ప‌ర‌ప‌తి ఉన్న‌వాడిగా ఎద‌గ‌డం వెన‌క దాస‌రి నారాయ‌ణ‌రావు అనే పెద్దాయ‌న ప్రోద్బ‌లం - ప్రోత్సాహం ఎంతో ఉంది. అందుకే ఆ ఇద్ద‌రూ ఇప్పుడు టాలీవుడ్‌ లో తిరుగులేని గురుశిష్యులు. ఏ విష‌యంలో అయినా క‌లిసిక‌ట్టుగానే పోరాడ‌తారు ఇద్ద‌రూ.

అయితే అస‌లు భ‌క్త‌వ‌త్స‌లం దాస‌రి ద‌ర్శ‌క‌త్వంలోని స్వ‌ర్గం న‌ర‌కం సినిమాకి ఎంపిక‌వ్వ‌క‌ముందు బోలెడంత మెలోడ్రామా. ఆ క్యారెక్ట‌ర్‌ తో పాటు ఆ సినిమాలో క్యారెక్ట‌ర్ల‌న్నిటికోసం ఏపీ మొత్తం జ‌ల్లెడ ప‌ట్టారు. ఆ క్ర‌మంలోనే బోసుబాబు అనే ఒక‌త‌న్ని మోహ‌న్ అనే క్యారెక్ట‌ర్ కోసం దాస‌రి ఎంపిక చేసుకున్నారు. అత‌డిపై రెండ్రోజుల పాటు షూటింగ్ కూడా చేశారు. మ‌రోవైపు మోహ‌న్‌ బాబుని కూడా టెస్టులు చేశారు. అప్ప‌టికి దాస‌రి మ‌న‌సులో మోహ‌న్‌బాబు చోటు చేసుకున్నారు. బోసుబాబు కాస్త భ‌య‌స్తుడు. ముందే అత‌డికి మేక‌ప్ వేయ‌గానే కెమెరా ముందు చెమ‌ట‌లు ప‌ట్టేశాయి. మ‌రుస‌టి రోజు ఏకంగా జ్వ‌రం కూడా వ‌చ్చేసింది. ఇక నేను చేయ‌లేను మ‌హాప్ర‌భో అని ఆయ‌న మొర‌పెట్టుకుంటే స‌రిగ్గా ఆ సంద‌ర్భం కోసమే ఎదురు చూస్తున్న దాస‌రి వెంట‌నే మోహ‌న్‌ బాబును రంగంలోకి దించేశారు.

అలా మోహ‌న్ క్యారెక్ట‌ర్‌ లోకి ఒదిగిపోయాడు నాటి భ‌క్త‌వ‌త్స‌లం. ఆ త‌ర్వాత మోహన్‌ కే బాబు త‌గిలించి మోహ‌న్‌ బాబును చేశారు దాస‌రి. ఇంట్రెస్టింగ్ రియ‌ల్ ఎపిసోడ్‌ లో మోహ‌న్‌ బాబుకి ఓ రియ‌ల్ విల‌న్ కూడా త‌గిలాడు. మొద‌టి సినిమా కి దాస‌రి ఎంపిక చేసుకున్నా.. మోహ‌న్‌ బాబుపై కోపంతో ఓ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ అత‌డి ప్రొఫైల్‌ ని దాచేశాడు. అయితే ఆ టైమ్‌ లో బాబు కాస్తా తెలివిగా దాస‌రి భార్య ప‌ద్మ‌ని క‌లిసి త‌న‌కి బ‌స్సు టిక్కెట్ ఖాయం చేసుకున్నాడు. ఒక జ‌త బ‌ట్ట‌లు ఒంటిపై ఉన్న‌వాటితోనే ఆయ‌న మ‌ద్రాసు బ‌స్సెక్కేసారు అదీ మ్యాట‌రు!