Begin typing your search above and press return to search.

చిరంజీవి, జగన్ తో రిలేషన్ పై మోహన్ బాబు హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   4 Oct 2021 4:31 AM GMT
చిరంజీవి, జగన్ తో రిలేషన్ పై మోహన్ బాబు హాట్ కామెంట్స్
X
తెలుగు సినీ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబుది ప్రత్యేక శైలి. మొదట్లో విలన్ గా నటించి ఆ తరువాత స్టార్ హీరోగా మారారు. టాలీవుడ్లోని అగ్ర నాయకుల్లో ఒకరైన మంచు మోహన్ బాబు సినిమాల్లో నటించడమే కాకుండా విద్యాసంస్థలను నెలకొల్పి ఎంతో మందికి విద్యాదానం చేశారు. కొన్నేళ్ల కిందట పోలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఆ తరువాత తిరిగి సినిమాలకే పరిమితయ్యారు. ఇటీవల ఆయన కుమారుడు మంచు విష్ణు ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబును ఓ ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

‘రాయలసీమ రామన్న చౌదరి’ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ‘నిన్న జరిగింది మరిచిపోను.. నేడు జరిగేది వాయిదా వేయను.. రేపటి గురించి ఆలోచించను’.. కానీ నిన్న జరిగింది మరిచిపోవాలి.. ఎందుకంటే పాత విషయాలతో రాగద్వేషాలు పెట్టుకోవడం దేనికి..? రియల్ లైఫ్లో చాలా మంది పాత విషయాలను గుర్తు పెట్టుకొని వాటి ఆధారంగా రాగ ద్వేషాలు పెంచుకొని వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు.’ అని అన్నారు.

‘నాకు ఎన్టీఆర్ దగ్గరి మనిషే.. చంద్రబాబు దగ్గరి బంధువే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గరి వారే.. ఎవరైనామాకు ఒక్కటే.. చంద్రబాబు తరుపున ప్రచారం చేశారు. ఆ తరువాత వైఎస్ కుటుంబం తరుపున ఉండాలనుకున్నాం.. అలాగే ఉంటున్నాం.. అంతేగానీ మాకు ఏదో కావాలని మాత్రం చేయడం లేదు. మాకు చేయాలనిపించింది చేస్తున్నాం. ఇక టీటీడీ చైర్మన్ పదవి ఆశించానని అందరూ అనుకుంటున్నారు.. అది ముఖ్యమంత్రి ఇష్టం వారు ఎవరికి ఇవ్వానుకుంటే వారికి ఇస్తారు..’

‘సీఎం జగన్ వల్ల అందరికీ భయం పోయిందంటున్నారు.. కానీ భయం ఉండాలి. కానీ భయమే జీవితం కాదు కదా..ప్రాణాలకు తెగించిన వాడు మరణాన్ని గడ్డిపోచలా చూస్తాడు. ఒకరి మోచేతి నీళ్లు తాగినప్పుడు భయపడాల్సిన అవసరం ఉంటుంది. ఆ అవసరం లేనప్పుడు భయపడాల్సిన అవసరం దేనికీ.. నాకు ముఖ్యమంత్రి గారంటే చాలా ఇష్టం.. అయితే చంద్రబాబు కొన్ని మిస్టేక్స్ చేశారు. విద్యాసంస్థలకు సంబంధించిన ఫీజులు, జీతాలు చెల్లించలేదు. రెండు రాష్ట్రాల్లో ద మోస్ట్ బెస్ట్ కాలేజీ మాది.. ప్రధానిని కలిసినప్పుడూ ఇదే విషయం చెప్పాం..’‘మమ్మల్ని ప్రధాని ఆహ్వానించారు. అయితే ఎందుకు పిలిచారో మాకు అర్థం కాలేదు. ఇదే విషయాన్ని మేం భోజనం చేస్తున్నప్పుడు ఆయనను అడిగాం. ‘మమ్మెల్నెందుకు పిలిచారు..? ’ అని ‘ ఇది మీ ఇల్లు.. మీరెప్పుడైనా రావచ్చు’ అని వినయంగా సమాధానం ఇవ్వడం బాగా నచ్చింది.

‘కరోనా కారణంగా సినిమా పరిశ్రమ చాలా దెబ్బతిన్నది. థియేటర్లో చప్పట్లు కొట్టేవారు కరువయ్యారు. ఓటీటీలో చాలా మంది సినిమాలు చూస్తున్నా వారికి అవి వినోదం ఇవ్వడం లేదు. మానసిక ప్రశాంతత కోసం సినిమాకు వెళ్తాం.. కానీ ఇంట్లో చూడడం వల్ల అది కలగదు. ఒక సినిమా 25 వారాలు నడిచిన రోజులున్నాయి. కానీ ఇప్పుడు సినీ ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో ఉంది. జూనియర్ ఆర్టిస్టులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. కరోనా తరువాత వెబ్ సిరీసులు బాగా పెరిగాయంటే నేను ఒప్పుకోను..నన్నే ఏమనుకున్నా సరే.. కానీ బాగా డబ్బు పెట్టి సినిమాలు తీసిన వారికి థియేటర్లు దొరకకపోవడం చాలా బాధాకరం. చిన్ని సినిమాలకు కూడా థియేటర్లు దొరకకపోతే వారి పరిస్థితి ఏంటి..? చిన్ని సినిమాలు ఆడాలి.. పెద్దవి ఆడాలి.. ’

‘విష్ణును మా అధ్యక్ష ఎన్నికల్లో నిలబెట్టాలని లేదు.. సడెన్లీగా ఒకరోజు వచ్చి ..‘డాడీ గురువుగారు మిమ్మల్ని పోటీ చేయమన్నప్పుడు వద్దన్నారు.. ఇప్పుడు నేను బెటర్ కదా..’ అని అడిగాడు.. అయితే బాధ్యతలు ఎక్కువగా ఉన్న విష్ణు రిస్క్ అవుతుందని చెప్పాను. అయితే ఏకగ్రీవం కోసం ప్రయత్నించాను.. అది కుదరలేదు..’ అని మోహన్ బాబు అన్నారు.