Begin typing your search above and press return to search.

ఏబీఎన్ ఆర్కేకు చమటలు పట్టించిన మోహన్ బాబు..

By:  Tupaki Desk   |   30 Sept 2021 10:00 PM IST
ఏబీఎన్ ఆర్కేకు చమటలు పట్టించిన మోహన్ బాబు..
X
సాధారణంగా తన ఇంటర్వ్యూకు వచ్చే రాజకీయ, సినీ ప్రముఖులను దడదడ లాడించే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తాజాగా కాస్త కంగారుపడ్డాడు. ఎందుకంటే ఈసారి వచ్చిన అతిథి అలాంటి వారు మాత్రం.. కలెక్షన్ కింగ్, ఫైర్ బ్రాండ్ మోహన్ బాబు తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో చిక్కకుండా ఆయనకే దడ పుట్టించాడు.

ముఖ్యంగా చిరంజీవితో వైరం.. బంధువైన జగన్ తో తగువు పెట్టించాలని చూసిన ఏబీఎన్ ఆర్కేకు మోహన్ బాబు తన సమాధానంతో దండం పెట్టించాడు. నువ్వు నాకు జగన్ కు, చిరంజీవి మధ్య విభేదాలు పుట్టిస్తున్నావా? అంటూ గట్టిగా అడిగేసరికి ఆర్కే నాకు వారితో గట్టు పంచాయతీ లేదంటూ చేతులెత్తి దండం పెట్టాడు.

ఇక చంద్రబాబుకు వ్యతిరేకంగా ధర్నా చేశావ్..? జగన్ కు వ్యతిరేకంగా చేయవా? అంటే మోహన్ బాబు 'నువ్వు చంద్రబాబు మనిషివా?' అంటూ కౌంటర్ ఇవ్వడంతో అలా అనకని.. తనకు ఎవరితో ఎలాంటి సంబంధం లేదంటూ కవర్ చేసుకునేందుకు ఆర్కే ఆపసోపాలు పడ్డాడు.

ఫైర్ బ్రాండ్ మోహన్ బాబు ముందు ఆర్కే పప్పులు ఉడకలేవని తాజా ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఇక పోయిన ఇంటర్వ్యూలోనే వైఎస్ షర్మిలను బుక్ చేయడానికి రెడీ అయ్యి విఫలమైన ఆర్కే తాజాగా మోహన్ బాబుతో ఇంటర్వ్యూలోనే తనే డిఫెన్స్ లో పడిపోయినట్టు ప్రోమో చూస్తే అర్థమవుతోంది.