Begin typing your search above and press return to search.

టాక్ ఆఫ్ ద టాలీవుడ్: మహానటి లుక్స్

By:  Tupaki Desk   |   6 May 2018 12:11 PM GMT
టాక్ ఆఫ్ ద టాలీవుడ్: మహానటి లుక్స్
X
కొత్త సిినమా ‘నా పేరు సూర్య’ థియేటర్లలో ఉన్నా ఇప్పుడు టాలీవుడ్లో చర్చలన్నీ ‘మహానటి’ చుట్టూనే నడుస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా చర్చనీయాంశమవుతున్నాయి. ఈ చిత్రం బృందం వినూత్నమైన ప్రచారంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అలనాటి నటీనటులు.. టెక్నీషియన్ల పాత్రల్లో ఇప్పటి నటీనటుల లుక్స్ లో ఒక్కొక్కరి లుక్స్ చూస్తే జనాలకు కడుపు నిండిపోతోంది. నిన్న ‘మాయాబజార్’లోని సావిత్రి గెటప్ లో కీర్తి సురేష్ చూస్తే కళ్లు చెదిరిపోయాయి. అలాగే చక్రపాణిగా అవసరాల శ్రీనివాస్.. కె.వి.రెడ్డిగా క్రిష్ ల లుక్స్ కు సంబంధించిన వీడియోలూ అలరించాయి.

తాజాగా ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు లుక్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. ఆ పాత్రకు మోహన్ బాబు పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపిస్తున్నారు. ఈ పాత్ర ఉత్సుకత రేకెత్తిస్తోంది. మరోవైపు జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కొత్త లుక్ కూడా ఆకర్షిస్తోంది. మరోవైపు కీర్తి సురేష్-సమంత కలిసి ఉమ్మడిగా ఈ చిత్ర ప్రమోషన్లలో పాల్గొంటూ తీసుకున్న సెల్ఫీ కూడా అలరిస్తోంది. మొత్తంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘మహానటి’ చర్చనీయాంశంగా కనిపిస్తోంది. కీర్తి సురేష్.. సమంత.. విజయ్ దేవరకొండ.. దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలు పోషించిన ‘మహానటి’ ఈ బుధవారమే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు.

వీడియో కోసం క్లిక్ చేయండి