Begin typing your search above and press return to search.

ఫొటోల వరకే.. అంతకు మించి కష్టమే!

By:  Tupaki Desk   |   22 May 2021 9:16 AM IST
ఫొటోల వరకే.. అంతకు మించి కష్టమే!
X
ఇటీవల తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ మరియు మోహన్ బాబు కలిసి దిగిన ఒక రీసెంట్ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రజినీకాంత్‌ భుజంపై స్టైల్‌ గా మోహన్ బాబు చేయి వేసి మరీ ఫొటో దిగారు. ఆ ఫొటోలో మంచు విష్ణును కూడా చూడవచ్చు. మంచు విష్ణు కంటే అందరి దృష్టి ఆ ఇద్దరు మిత్రులపైనే ఎక్కువగా పడుతుంది. మోహన్‌ బాబు.. రజినీకాంత్‌ లు ఆప్త మిత్రులు. సుదీర్ఘ కాలంగా మంచి స్నేహితులుగా కొనసాగుతున్న ఇద్దరు ఒరేయ్‌ ఒరేయ్‌ అనుకునేంత సన్నిహితులు. అలాంటి వీరిద్దరు దాదాపు పాతికేళ్ల క్రితం పెదరాయుడు సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికి తెలుసు. మళ్లీ అప్పటి నుండి వీరి కాంబోలో సినిమా కోసం అభిమానులు వెయిట్‌ చేశారు. కాని వర్కౌట్‌ అవ్వలేదు.

తాజాగా అన్నాత్తే షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ లో నెల రోజులు గడిపిన రజినీకాంత్‌ షూటింగ్ ను ముగించుకున్న తర్వాత మోహన్‌ బాబు ఇంట రెండు రోజులు ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారి ద్వారా తెలుస్తోంది. చాలా కాలం తర్వాత ఇద్దరు మిత్రులు చాలా సమయం గడిపారట. ఆ సమయంలో తీసుకున్న ఫొటోలే ఇవి. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో అంతా వీరిద్దరి కాంబోలో మళ్లీ సినిమా గురించి చర్చిస్తున్నారు. మళ్లీ వీరి కాంబోలో సినిమా వస్తే చూడాలని ఉందంటూ కొందరు కామెంట్స్ చేశారు. రజినీకాంత్‌ సినిమాలో మోహన్‌ బాబుకు ఛాన్స్ వస్తే చేస్తాడా అంటూ కొందరు ప్రశ్నించారు. మొత్తానికి వీరిద్దరి కాంబో మూవీ అంటూ హాట్ టాపిక్ నడుస్తోంది.

పాతిక సంవత్సరాల క్రితం వీరిద్దరు కలిసి నటించారు. అలాంటి కథలు మళ్లీ వస్తే నటిస్తారేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా కొందరు మీడియా వర్గాల వారు మాత్రం ఈ సమయంలో ఇద్దరి కాంబో సినిమా దాదాపుగా కష్టమే అంటున్నారు. రజినీకాంత్‌ సూపర్ స్టార్‌ ఇమేజ్ తో సినిమాలు చేస్తూ ఆయన సినిమాలో ఆప్త మిత్రుడు అయిన మోహన్‌ బాబు విలన్‌ గానో లేదా మరేదైనా ముఖ్యపాత్రలోనే నటించడం కష్టమే. ఎందుకంటే మోహన్‌ బాబుకు తన సినిమాలో అలాంటి చిన్న పాత్ర నో లేదా విలన్‌ పాత్రనో ఇవ్వడం వల్ల తన మిత్రుడిని తాను అవమానించినట్లుగా రజినీకాంత్‌ అభిప్రాయ పడే అవకాశం ఉంది.

అందుకే వీరిద్దరిని ఇలా ఫొటోల్లో మాత్రమే చూడాల్సిందే అని ఒకే సినిమాలో కలిసి నటిస్తే చూడాలనుకోవడం అత్యాశ అవుతుందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఏ సమయంలో ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. కనుక కష్టం అనుకున్నది జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇండస్ట్రీలో అరుదైన కాంబోలో ఎన్నో ఆవిష్కారం అయ్యాయి. త్వరలో మళ్లీ ఈ కాంబో కూడా పునః దర్శణం కలిగిస్తుందేమో చూడాలి.